India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ సీఎం <<15518802>>రేఖా గుప్తా<<>> ఎన్నికల సమయంలో తన ఆస్తుల వివరాలను ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2023-24FYలో తన సంపాదన ₹6.92 లక్షలు అని, ₹48.44లక్షల రుణాలు ఉన్నట్లు వెల్లడించారు. ₹1.25 కోట్ల విలువైన చరాస్తులు, ₹2.30కోట్ల స్థిరాస్తులు, ₹18 లక్షల విలువైన ఆభరణాలు, రెండు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలిపారు. తనకు సొంత వాహనం లేదని పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ.కోట్లు పోతే సంపాదించుకోవచ్చని, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా అని ఫైరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండగా, 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నారు.
IND: రోహిత్, గిల్, కోహ్లీ, రాహుల్, జడేజా, శ్రేయస్, హార్దిక్, అక్షర్, హర్షిత్, షమీ, కుల్దీప్
BAN: హసన్, సౌమ్య సర్కార్, శాంటో, హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మిరాజ్, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్, హసన్ షకీబ్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహ్మాన్

TG: రాజలింగమూర్తి <<15520182>>హత్యను <<>>BRSకు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ‘నాతో పాటు KCR, హరీశ్ రావుపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను చంపించానని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేస్తున్నారు? BRS హత్యారాజకీయాలను ప్రోత్సహించదు. కాళేశ్వరం కేసును చట్టపరంగానే ఎదుర్కొంటాం’ అని తెలిపారు.

లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల కింద హైకోర్టు జడ్జీలపై విచారణకు ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆ ఆదేశాలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొంది. ఇద్దరు హైకోర్టు జడ్జీలపై Jan 27న లోక్‌పాల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సుమోటోగా తీసుకొని విచారించింది. హైకోర్టు జడ్జీలు లోక్‌పాల్ పరిధిలోకి రారని, చట్టంలో తప్పుగా నిర్వచించారని కేంద్రం తరఫున వాదించిన SG తుషార్ మెహతా సైతం పేర్కొనడం గమనార్హం.

బ్రహ్మానందంలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నవ్వులు తెప్పించే నైజీరియాకు చెందిన ఒసితా ఇహెమ్ అలియాస్ పావ్‌పా బర్త్ డే నేడు. చిన్నపిల్లాడిలా కనిపించినా ఆయనకు 42 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న ఒసితా దాదాపు 300 సినిమాల్లో నటించారు. మీమర్స్‌కు మంచి స్టఫ్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో స్టిక్కర్స్ రూపంలో మనకు కనిపిస్తుంటారీయన.

ఒంటరితనం అనేది చాలా భయంకరమైనదని సమంత అన్నారు. తను మూడురోజుల పాటు మొబైల్, సోషల్ మీడియా, ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా మౌనంగా గడిపానని తెలిపారు. ఈజర్నీ తనలో ఎంతో పరివర్తన తెచ్చిందని, మానసిక ప్రశాంతత లభించిందన్నారు. మానసికంగా శక్తిమంతంగా మారాలంటే ఇటువంటి మార్గాలను ప్రయత్నించండని సమంత ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ అనే చిత్రంలో సమంత నటిస్తున్నారు.

AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో YCP నేతలు సమావేశమయ్యారు. నిన్న గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా మాజీ CM జగన్‌కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. జగన్ రక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మండలి ప్రతిపక్ష నేత బొత్స, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

AP: జగన్‌తో సెల్ఫీ దిగిన చిన్నారి దేవికపై TDP దుష్ప్రచారం చేస్తోందని YCP మండిపడుతోంది. అమ్మ ఒడి రాలేదని చెప్పడంపై ట్రోల్స్ చేస్తున్నారంది. ‘బాలిక రవీంద్ర భారతి స్కూల్‌లో చదువుతుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, తండ్రి అద్దె ఇంట్లో ఉంటూ షాప్‌లో పనిచేస్తుంటే దానికి యజమాని అని పోస్టులు చేస్తున్నారు. చిన్నారి తల్లి YCP నేత అంటూ ఫేక్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోరా?’ అని ప్రశ్నిస్తోంది.
Sorry, no posts matched your criteria.