News August 23, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి YS జగన్ డెడ్‌లైన్

image

AP: అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని YS జగన్ ఆరోపించారు. 2-3 వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ‘నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.

News August 23, 2024

ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి: పవన్

image

AP: గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించం. అవసరమైతే గూండా యాక్ట్ తీసుకొస్తాం. గ్రామాల్లో కాలేజీలు, క్రీడా మైదానాలు లేవు. ప్రభుత్వ స్థలాలుంటే నిర్మాణాలు చేసుకోవచ్చు. దాతలు ముందుకొస్తే నేను కూడా నిధులు తీసుకొస్తా. క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తా ‘ అని పేర్కొన్నారు.

News August 23, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.220 తగ్గి రూ.72,650కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.66,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.91,700గా ఉంది.

News August 23, 2024

అనిల్ అంబానీకి షాక్ ఇచ్చిన సెబీ

image

నిధుల మళ్లింపు కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(RHFL) మాజీ ఉద్యోగులు, 24 సంస్థలపై సెబీ నిషేధం విధించింది. ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనవద్దని ఆదేశించింది. అనిల్ అంబానీపై రూ.25 కోట్ల ఫైన్ వేసింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి కీలక హోదాల్లో కొనసాగకూడదని స్పష్టం చేసింది. ఉద్యోగుల సాయంతో RHFL నిధులను అనిల్ అనుబంధ సంస్థలకు రుణాలుగా మళ్లించినట్టు సెబీ తెలిపింది.

News August 23, 2024

మోదీ వార‌సుడు అమిత్ షా.. కొత్త స‌ర్వే

image

ప్ర‌ధాని మోదీ త‌రువాత ఆ బాధ్య‌త‌లను చేపట్టడానికి BJPలో అమిత్ షా సమర్థులని సర్వేలో తేలింది. 25% మంది మద్దతుతో ఆయన ముందున్నట్టు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే-2024 వెల్ల‌డించింది. అమిత్ షా త‌రువాత 19% మంది మ‌ద్ద‌తుతో యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో, 13%తో 3వ స్థానంలో గ‌డ్క‌రీ, 5% మద్దతుతో రాజ్‌నాథ్, శివరాజ్ సింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గతంతో పోలిస్తే అమిత్ షాకు 3-4% మద్దతు తగ్గింది.

News August 23, 2024

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 5వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు బెయిల్ ఇవ్వడంపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరో వారం సమయం కావాలన్న CBI విజ్ఞప్తితో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

News August 23, 2024

ఏప్రిల్ 18న తేజా సజ్జ ‘మిరాయ్’

image

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. తేజ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాతో తేజ సూపర్ హిట్ అందుకున్నారు.

News August 23, 2024

మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరో ఎవరంటే?

image

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టర్స్ జాబితాను (JULY) ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX’ విడుదల చేసింది. మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్‌గా ప్రభాస్ నిలిచారు. ‘కల్కి’ భారీ విజయం పొందడంతో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. తర్వాతి స్థానాల్లో విజయ్, షారుఖ్ ఖాన్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ఉన్నారు. టాప్-10లో ఐదుగురు మనవాళ్లే ఉండటం విశేషం.

News August 23, 2024

పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ గమనించాలి: పోలీసులు

image

TG: యుక్తవయసు పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ‘డ్రగ్స్ మత్తుకు బానిసగా మారిన యువత కుటుంబంతో పాటు సమాజానికీ ప్రమాదకరం. డ్రగ్స్ నుంచి పిల్లల్ని కాపాడే బాధ్యత పోలీసులకు ఎంత ఉందో పేరెంట్స్‌కూ అంతే ఉంది’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 40వేల మంది డ్రగ్స్ బాధితులను టీన్యాబ్ గుర్తించిందని, వారిలో విద్యావంతులు, ఉన్నతోద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

News August 23, 2024

18 ఏళ్లు నిండే వారికి అలర్ట్

image

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 JAN 1 వరకు 18 ఏళ్లు నిండే వారు ఓటర్ల జాబితాలో పేరు <>నమోదు<<>> చేసుకోవచ్చు. OCT 10 వరకు BLOలు ఇంటింటి సర్వే, జాబితాలో ఫొటోల మార్పు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలతో OCT 29న ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, DEC 24 నాటికి పరిష్కరించి JAN 6న తుది జాబితా ప్రకటిస్తారు.