News February 19, 2025

బంగారం ధరలు పైపైకి!

image

బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.80,350లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 పెరగడంతో రూ.87,650లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది.

News February 19, 2025

సీబీఎస్ఈ కీలక నిర్ణయం

image

సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ తరహాలో ఏడాదిలో రెండు సార్లు పరీక్ష నిర్వహణను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న ముసాయిదాను విడుదల చేయనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని తెలిపింది.

News February 19, 2025

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

image

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

News February 19, 2025

దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

image

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

News February 19, 2025

రేవంత్‌కు రూ.4.20 లక్షల కోట్లు జరిమానా వేసినా తప్పులేదు: కేటీఆర్

image

TG: అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు జరిమానా వేయాలని కేటీఆర్ అన్నారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పినా ఫైన్ వేశారని ఓ ఆర్టికల్‌ను కేటీఆర్ చేశారు. కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పులు, హామీల గురించి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 420 అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి రూ.4.20 లక్షల కోట్ల జరిమానా వేసినా తప్పులేదని అన్నారు.

News February 19, 2025

RTCలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్

image

APSRTCలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. అద్దె బస్సులు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, బస్సుల్లో అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజీలు, స్వీపర్లు, గైడ్లు, కౌంటర్లలో బస్ టికెట్లు జారీ చేసే సిబ్బందికి ఇది వర్తించనుంది. దీనికి వారిని నియమించుకున్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి రూ.499 చొప్పున పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన బీమాకు ప్రీమియం చెల్లించాలి.

News February 19, 2025

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

image

బాలీవుడ్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన తొలి చిత్రం ‘బేబీజాన్’ ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు రెంట్ పద్ధతితో ఉండగా నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. కాగా ఈ మూవీ తమిళ చిత్రం విజయ్ ‘తేరి’కి రీమేక్ కావడం గమనార్హం.

News February 19, 2025

హైఅలర్ట్.. సరిహద్దుల్లో మరోసారి అలజడి

image

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

News February 19, 2025

చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

image

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.

News February 19, 2025

VIRAL: అమ్మాయిల ఇన్‌స్టా స్టోరీ పోస్ట్

image

ఓ యువతీయువకుడు సంతోషంగా కలిసున్నప్పుడు, తర్వాత ఆ యువతి తీవ్రంగా గాయపడ్డ ఫొటోల పోస్ట్ ఒకటి ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి ‘డియర్ గర్ల్స్. మీ ఫ్యూచర్ పార్ట్‌నర్‌ని మనసు, వ్యక్తిత్వం చూసి ఎంచుకోండి కానీ ముఖం, డబ్బు చూసి కాదు’ అని క్యాప్షన్ రాశారు. అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోయిన అమ్మాయి చివరికి ఇలా బాధపడాల్సి వస్తుందని అర్థమొచ్చే ఈ పోస్ట్‌ను చాలామంది అమ్మాయిలు స్టోరీగా పెట్టుకున్నారు.