News September 28, 2024

ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ మృతి

image

బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ కన్నుమూశారు. బర్ఫీ, ఫైటర్, పఠాన్‌లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశారు. తమ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతారని Tసిరీస్ ట్వీట్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. రజత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్నేహితుడు అనీశ్ తెలిపారు. నిన్న కూడా ఎంతో ఆహ్లాదంగా మాట్లాడుకున్నామన్నారు.

News September 28, 2024

జగన్‌కు కొవ్వెక్కింది.. పాకిస్థాన్ వెళ్లిపోవాలి: సోమిరెడ్డి

image

AP: దేశాన్ని, మతాలను ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయనకు కొవ్వెక్కి ఇదేం దేశం అంటున్నారని, ఇండియా కాదనుకుంటే పాక్ లేదా దుబాయ్‌కి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భారతి ఇంట్లోకి రానివ్వదని పర్యటన రద్దు చేసుకున్నావా? అని ప్రశ్నించారు. తల్లి, చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్‌ అని దుయ్యబట్టారు.

News September 28, 2024

తగ్గిన వెండి ధర

image

రోజురోజుకూ ఎగబాకుతున్న వెండి ధరలు ఇవాళ కాస్త దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి, రూ.95,000కు చేరింది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్లు రూ.50 చొప్పున తగ్గి రూ.77,400, రూ.70,950గా ఉన్నాయి.

News September 28, 2024

కుల్గాంలో ఉగ్ర‌వాదుల కాల్పులు.. నలుగురు భ‌ద్ర‌తా సిబ్బందికి గాయాలు

image

కశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో న‌లుగురు భ‌ద్ర‌తా సిబ్బంది గాయ‌ప‌డ్డారు. ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌పై నిఘా వర్గాల స‌మాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసు బలగాలు కుల్గాం, అరిగాంలో జాయింట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో తార‌స‌ప‌డ్డ‌ ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణార‌హితంగా భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై కాల్పులు ప్రారంభించారు. ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతున్న‌ట్టు భార‌త సైన్యం తెలిపింది.

News September 28, 2024

సీతారామన్‌పై FIR నమోదుకు ప్రత్యేక కోర్టు ఆదేశాలు

image

FM నిర్మలా సీతారామన్‌పై FIR నమోదు చేయాలని బెంగళూరులోని ఓ స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా ఆమె బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ JSP నేత ఆదర్శ్ అయ్యర్ ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు BJP ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ నేతలు నళీన్ కుమార్, బీవై విజయేంద్ర పేర్లనూ చేర్చారు. ED దాడులతో ఒత్తిడి చేసి కార్పొరేట్లతో రూ.కోట్ల విలువైన బాండ్లు కొనిపించారని ఆరోపించారు.

News September 28, 2024

INDvsBAN: రెండు రోజు ఆట రద్దు

image

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా రెండో రోజు రద్దయింది. ఈ విషయాన్ని అంపైర్లు ప్రకటించారు. రెండో రోజూ ఒక్క బంతి కూడా పడకపోవడం గమనార్హం. కొన్ని గంటలుగా వర్షం లేకపోయినప్పటికీ నీరు ఇంకా గ్రౌండ్‌లో నిలిచి ఉంది. 3 సూపర్ సప్పర్స్ పనిచేస్తున్నా ప్రయోజనం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.

News September 28, 2024

కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు

image

AP: వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘మనం ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం-పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలి’ అని బాబు సూచించారు.

News September 28, 2024

సొంత క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయనున్న రణ్‌బీర్

image

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా పారిశ్రామికవేత్తగా మారనున్నారు. ఆయన సొంతగా క్లాతింగ్ బ్రాండ్‌ను ‘ARKS’ పేరుతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇంకా అధికారికంగా ఈ బ్రాండ్ అందుబాటులోకి రానప్పటికీ ఆయన భార్య అలియా, తల్లి నీతూ కపూర్ ఇన్‌స్టాలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. @arks సైతం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. కాగా, రణ్‌బీర్‌కు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు.

News September 28, 2024

దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులు: బండి

image

వైసీపీ చీఫ్ జగన్ తీరు హిందుత్వంపై దాడి చేసేలా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఇతర మతస్థులు హిందూ ఆలయాల్లోకి వస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. వారిని క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతోందన్నారు. మమ్మీ, డాడీ కల్చర్ వద్దని, అమ్మనాన్నే ముద్దు అని చెప్పారు.

News September 28, 2024

వందే భార‌త్ రైళ్లపై ఇతర దేశాల చూపు!

image

వందే భార‌త్ రైళ్ల‌ను దిగుమ‌తి చేసుకొనేందుకు చిలీ, కెనడా, మలేషియా వంటి దేశాలు ఆస‌క్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ త‌ర‌హా రైళ్లు ఇత‌ర దేశాల నుంచి కొనుగోలుకు రూ.160-180 కోట్లు అవుతుంద‌ని, అదే భార‌త్ వీటిని రూ.120-130 కోట్ల‌కే త‌యారు చేస్తుండ‌డ‌మే ఈ దేశాల ఆస‌క్తికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. జ‌పాన్ బుల్లెట్ రైలు 0-100 KPHకు చేరుకోవ‌డానికి 54 సెకన్లు పడుతుంది. వందేభార‌త్‌‌ 52 సెకన్లలో చేరుకుంటుంది.