India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని CM రేవంత్ అన్నారు. అయితే కొందరు AC గదులను వదిలేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు. HYDలో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాలకులు ఎన్ని పాలసీలు చేసినా వాటిని సమర్థంగా అమలు చేసేది అధికారులేనని తెలిపారు. వాళ్లు చూపే నిబద్ధతను బట్టి పథకాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఇటీవల తాను చేపట్టిన ఫ్రాన్స్, అమెరికా పర్యటనల వివరాలు, అక్కడ చేసుకున్న ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలను ముర్ముకు మోదీ వివరించారు. భారత్-అమెరికా, భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సంబంధాల సారాంశాలను ఆమెతో మోదీ పంచుకున్నారు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడే తొలి మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నారు. గత సీజన్‌లో స్లోఓవర్ రేటు కారణంగా పాండ్యపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఆ తర్వాత అతడు తొలి మ్యాచ్ ఆడనుండటంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో మార్చి 23న జరిగే మ్యాచ్‌కు బరిలోకి దిగరు. దీంతో MI తొలి మ్యాచ్‌కు ఎవరిని కెప్టెన్‌గా చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్‌గా ఎవరు ఉండాలో కామెంట్ చేయండి.

AP: చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగడాలు పీక్స్‌కు చేరాయని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి విడదల రజినిపై కోపంతో ఆమె మామపై దాడి చేయించారని ఆరోపించింది. 83 ఏళ్ల వ్యక్తి అని కూడా చూడకుండా తన అనుచరులతో కారు అద్దాలను ధ్వంసం చేయించి హత్యాయత్నం చేశారని ట్వీట్ చేసింది. మరీ ఇంత నీచ రాజకీయాలా చంద్రబాబు? అని ప్రశ్నించింది.

IPL-2025లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 11 మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ స్టేజ్‌లో SRH 7 మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ కూడా HYDలో జరగనున్నాయి. అలాగే, ఢిల్లీ జట్టు రెండో హోం వెన్యూగా విశాఖపట్నాన్ని ఎంచుకుంది. దీంతో మార్చి 24న లక్నోతో, 30న SRHతో వైజాగ్‌లో ఢిల్లీ తలపడనుంది. IPLలో మీ ఫేవరెట్ టీమ్ ఏదో COMMENT చేయండి.

AP: చిరుత సంచారం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్లే వారి రక్షణ దృష్ట్యా TTD ఆంక్షలు విధించింది. తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉ.5 నుంచి మ.2 గంటల వరకు యథావిధిగా అనుమతిస్తోంది. అనంతరం 70-100 మందితో గుంపులుగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు. 12 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి మార్గం మూసివేస్తున్నారు.

AP: రాష్ట్రంలో తొలి గులియన్ బార్ సిండ్రోమ్<<15225307>>(GBS)<<>> మరణం నమోదైంది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల తెలంగాణలోనూ సిద్దిపేటకు చెందిన మహిళ <<15405226>>జీబీఎస్<<>> కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.

IPL-2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచులు ఆడనుంది. ఇందులో HYDలోనే 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ 23న RRతో HYDలో తలపడనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ రెడ్డి, తదితర ప్లేయర్లతో SRH శత్రు దుర్భేద్యంగా ఉంది. SRH పూర్తి షెడ్యూల్‌ని పై ఫొటోలో చూడవచ్చు. కాగా, ఈ ఏడాది IPL మార్చి 22న కోల్‌కతాలో ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. మొత్తం పది టీమ్(KKR, SRH, RCB, CSK, MI, DC, PBKS, GT, LSG, RR)లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఏ జట్టు ఏ రోజు ఎవరితో ఏ వేదికలో మ్యాచ్ ఆడనుంది? పూర్తి జాబితాను పై ఫొటోల్లో చూడవచ్చు.

గుర్తుతెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే ఎట్టిపరిస్థితుల్లో తిరిగి కాల్ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. +371(5), +381 (2) నంబర్ల నుంచి కాల్ చేసి #90 లేదా #09 డయల్ చేయమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో చేయొద్దన్నారు. అలా చేస్తే నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930ను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.