News September 28, 2024

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హతం

image

బీరూట్‌పై జరిపిన రాకెట్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి అతడితో కమ్యూనికేషన్ లేదని హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు న్యూస్ ఏజెన్సీ AFPకి తెలపడం ఈ వార్తను కన్ఫర్మ్ చేసినట్టు అయింది. ‘హసన్ నస్రల్లా చనిపోయాడు’ అని IDF అధికార ప్రతినిధి నడవ్ షోషాని ట్వీట్ చేశారు. లెబనాన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై IDF భీకర దాడుల గురించి తెలిసిందే.

News September 28, 2024

ఢిల్లీలో కిడ్నీ, ముంబైలో గుండె జబ్బులెక్కువ!

image

కిడ్నీ జబ్బులకు ఢిల్లీ రాజధానిగా మారింది! ఇక్కడ ఎక్కువగా ఈ క్లైమ్సే వస్తున్నాయని ACKO ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ తెలిపింది. కోచి, సికింద్రాబాద్, బెంగళూరు, జైపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయంది. నిరుడు ఓ కిడ్నీ ఇష్యూకు అత్యధికంగా రూ.25 లక్షల బిల్లు వేశారంది. ఈ రోగుల సగటు వయసు 47 ఏళ్లు. ఇక గుండెజబ్బుల క్లైమ్స్‌లో కోల్‌కతా, ముంబై టాప్‌లో ఉన్నాయి. క్యాన్సర్ కేసులు 2020-25 మధ్య 13% పెరిగాయి.

News September 28, 2024

విశాఖ ఉక్కు ఏపీ ప్రజల సెంటిమెంట్: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

image

AP: విశాఖ ఉక్కు ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడంలో సాంకేతిక సమస్యలున్నాయని చెప్పారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని చూస్తున్నామన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సంస్థను లాభాల్లోకి ఎలా తీసుకురావాలో చర్చిస్తున్నామన్నారు.

News September 28, 2024

స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని ఆందోళన

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల టైమింగ్స్ మార్చాలని HYD ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మెస్ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల ఆందోళనకు టీచర్స్ MLC నర్సిరెడ్డి మద్దతిచ్చారు.

News September 28, 2024

సీఎం రేవంత్ రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ

image

TG: JNAFAUకు భూకేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యావేత్తలు కోదండరాం, హరగోపాల్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘JNAFAUకి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూకేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. నామమాత్రం ఫీజుతో విద్య అందిస్తున్న ఏకైక వర్సిటీ అంబేడ్కర్ వర్సిటీ మాత్రమే. ఆ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది’ అని వారంతా అభిప్రాయపడ్డారు.

News September 28, 2024

PHOTOS: కలల గూడు.. కన్నీటి గోడు

image

TG: ‘హైడ్రా’ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించడంతో చాలామంది ఇవాళ తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. వారితో మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారంటూ బాధితులు గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు పైన చూడొచ్చు.

News September 28, 2024

APPLY NOW.. 8,113 ఉద్యోగాలు

image

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు OCT 13 వరకు అప్లై చేయవచ్చు. OCT 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు ఛాన్సుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 28, 2024

బ్యాంక్ అకౌంట్లను ఊడ్చేస్తున్న హెల్త్‌కేర్ కాస్ట్

image

దేశంలో హెల్త్‌కేర్ కాస్ట్ ఏటా 14% పెరుగుతోందని ACKO హెల్త్ ఇన్సూరెన్స్ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది. ఈ సెక్టార్లో డబుల్ డిజిట్ ఇన్‌ఫ్లేషన్ ఉండటమే కారణమంది. హాస్పిటల్ ఛార్జీల్లో 23% అప్పు చేసి, 63% సేవింగ్స్ డబ్బుతో చెల్లిస్తున్నారని వెల్లడించింది. దీంతో ఫ్యామిలీపై విపరీతమైన భారం పడుతోందని తెలిపింది. ఇలాంటి ఊహించని సంక్షోభాల్లో చిక్కుకోకుండా మెరుగైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరమని సూచించింది.

News September 28, 2024

కర్ణాటక పాలిటిక్స్: నిర్మల ఎందుకు రిజైన్ చేయాలన్న కుమారస్వామి

image

కర్ణాటకలో గతంలో చూడని పాలిటిక్స్ కనిపిస్తున్నాయని కేంద్రమంత్రి, JDU నేత కుమార స్వామి అన్నారు. ‘కాంగ్రెస్ పవర్‌ను దుర్వినియోగం చేస్తోంది. మా స్టేట్‌ పోలీస్ శాఖ కొత్తగా పనిచేస్తోంది. CM, మంత్రులు కేంద్రం, కేంద్ర సంస్థలపై దాడి చేస్తున్నారు. CM నన్ను, నిర్మలను రిజైన్ చేయమంటున్నారు. ఆమెపై FIRకు ఆదేశించారు. ఎన్నికల బాండ్ల డబ్బులేమైనా ఆమె పర్సనల్ అకౌంట్లోకెళ్లాయా? ఆమెందుకు రిజైన్ చేయాల’ని ప్రశ్నించారు.

News September 28, 2024

లడ్డూ వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పూజలు

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారంటూ వైసీపీ చీఫ్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు జిల్లా కొరిటిపాడులోని కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు అంబటి, విడదల రజిని, ఎమ్మెల్సీ ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల పూజలు నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.