India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా అరుదైన రికార్డును సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్(92.31 శాతం) నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 26 మ్యాచ్‌లకు గాను ఏకంగా 24 టీ20ల్లో గెలిచింది. 2018లో పాక్ 89.43%, 2023లో ఉగాండా 87.88%, 2019లో పపువా న్యూగినియా 87.5%, 2022లో టాంజానియా 80.77% విజయాలు నమోదు చేశాయి.
AP: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
TG: BRSలో ఎవరూ మిగలరని, హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలే ఆ పార్టీలో ఉంటారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి కొంతమందికి పదవులు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.
గుజరాత్‌లోని ధార్పూర్ GMERS మెడికల్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. థర్డ్ ఇయర్ సీనియర్స్ 15 మంది ఇంట్రో పేరుతో ఫస్ట్ఇయర్ స్టూడెంట్ అనిల్ మెథానియాను ర్యాగింగ్ చేశారు. ఏకధాటిగా 3 గంటలు నిలబెట్టారు. దీంతో ఆ విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. 3 గంటలు నిలబెట్టిన విషయాన్ని పోలీసులు రికార్డు చేసుకున్న కాసేపటికే అతడు మరణించడం సంచలనంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో భారీగా పతనమైన సూచీలు మధ్యాహ్నం రికవరీ అయ్యాయి. ఆఖర్లో తగ్గి మోస్తరు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,453 (-78), సెన్సెక్స్ 77,339 (-241) వద్ద క్లోజయ్యాయి. IT, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. మెటల్, FMCG, PSU BANKS, REALTY స్టాక్స్ అదరగొట్టాయి. TCS, DRREDDY, INFY, BPCL, CIPLA టాప్ లూజర్స్.
మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM బిరేన్‌సింగ్ పదవిని వీడే అవకాశం ఉంది. లేదా బలవంతంగా ఆయనతో రాజీనామా చేయిస్తారని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆయన BJP MLAలతో సమావేశం అవుతున్నారు. ఇందులో అనూహ్య నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే కాన్‌రాడ్ సంగ్మా నాయకత్వంలోని NPP ప్రభుత్వం నుంచి తప్పుకుంది. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్ల దాడులతో రాష్ట్రంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే.
AP: వైసీపీ హయాంలో ప్రారంభించిన జగనన్న కాలనీలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. అధికారుల నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొందరు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ జగనన్న ఇళ్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులతో ఏటా లక్షల మంది చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటాం. అయితే, నాణ్యమైన గాలిని పీల్చుకోలేకపోవడం వల్ల కూడా ఏటా ఇండియాలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలుసా? కలుషితమైన గాలిని పీల్చి శ్వాసకోశ వ్యాధులు, ఇతర రోగాలతో బాధపడుతూ నిత్యం 5400 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం ఈ మహమ్మారిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఓ వైపు అభివృద్ధిలో దూసుకెళ్తూనే మరోవైపు నగరవాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే మార్గాలను అన్వేషిస్తున్నాయి బెంగళూరు, చెన్నై నగరాలు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్కడ పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాయు నాణ్యత సూచీలో వాయు నాణ్యత బెంగళూరులో 82, చెన్నైలో 82గా ఉంది. ఇక కొచ్చిలో అత్యల్పంగా 13AQIతో స్వచ్ఛమైన వాయువు లభించే సిటీగా నిలిచింది.
AP సీఎం చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. విజయనగరంలో పలువురు భూములు ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు. ఆరోపణలున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.