India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.

వారానికి 70, 90hr పనిచేయాలంటూ కంపెనీల దిగ్గజాలు ఉచిత సలహాలిస్తున్న వేళ ఓ టెకీ ఆవేదన ఆలోచింపజేస్తోంది. తాను రోజూ 14hr పనిచేస్తూ ₹7.5Cr జీతం తీసుకుంటున్నా మ్యారేజ్ లైఫ్ విషాదాంతమైందన్నారు. ‘కూతురు పుట్టినప్పుడు నేను మీటింగ్‌లో ఉన్నా. డిప్రెషన్‌లో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయా. ఇప్పుడు ఆమె డివోర్స్ కోరుతోంది. కెరీర్‌లో ఎంతో సాధించినా జీవితం శూన్యంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.

AP: అన్నమయ్య జిల్లాలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడి చేసింది <<15461253>>టీడీపీ నేత కుమారుడని<<>> ఆరోపణలు వస్తుండటంతో కేసు నీరుగారకుండా చూడాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏంటి షాక్ అయ్యారా? బెంగళూరులో వాలంటైన్స్ డే సందర్భంగా ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.389 చెల్లిస్తే చాలు మీకు ఆ రోజుకు ప్రియుడు దొరికినట్లే. నగరంలోని చాలా చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ సంస్కృతి చైనా, జపాన్, థాయ్‌లాండ్‌లో ప్రాచుర్యం పొందింది. ఇది నగర సంస్కృతికి ముప్పుగా భావించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేశారు.

ఆర్సీబీతో జరిగిన WPL-2025 ఓపెనింగ్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 201/5 స్కోర్ చేసింది. కెప్టెన్ గార్డ్‌నర్ 37 బంతుల్లోనే 79* రన్స్ చేశారు. ఇందులో 8 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. బెత్ మూనీ 56, డియాండ్రా డాటిన్ 25, సిమ్రన్ షేక్ 11, లౌరా 6, హేమలత 4, హర్లీన్ 9* రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ 2, కనిక అహుజా, జార్జియా, ప్రేమా రావత్ తలో వికెట్ తీశారు.

TG: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గిరిజన ఉద్యోగులకు రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు జీవో జారీ చేసింది. అన్ని శాఖల్లో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పబ్లిక్ హాలిడే ఇవ్వాలని గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతుండగా, క్యాజువల్ లీవ్‌ను మంజూరు చేసింది.

APలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు <<15225307>>వెలుగు చూశాయని<<>> వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరు, విశాఖలో ఐదు చొప్పున, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కో కేసు బయటపడ్డాయని పేర్కొంది. బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 8వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.
Sorry, no posts matched your criteria.