India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలా చేస్తే ఒక నెల జీతం(గరిష్ఠంగా ₹15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్‌పై ఆసక్తి చూపడం లేదు.

TG: ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలకు<<>> BJP MP రఘునందన్ రావు కౌంటరిచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం OC నుంచి BCకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదన్నారు. మోదీ క్యాబినెట్‌లో 19 మంది BCలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు.

AUSతో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 174 పరుగుల తేడాతో కంగారూలను చిత్తు చేసింది. అంతకుముందు PAKతో జరిగిన ODI సిరీస్‌నూ ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో వరుసగా 4 మ్యాచ్‌లు ఓడినట్లయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఫలితాలు ఆ జట్టుకు ఎదురుదెబ్బే. కీలక ఆటగాళ్లు కమిన్స్, హేజిల్ వుడ్, మార్ష్, స్టార్క్ కూడా CTకి దూరమైన విషయం తెలిసిందే.

TG: మాజీ CM KCR లాంటి వాళ్లు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయనే కులగణనలో పాల్గొనలేదని CM రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని, వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు. జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబట్టారు. KTR, హరీశ్ గ్యాంబ్లర్లు అని విమర్శించారు.

పరీక్షల సమయంలో ఎనర్జీగా ఉండేందుకు హోంపుడ్ బెటర్ ఛాయిస్ అని న్యూట్రీషనిస్ట్స్ సూచిస్తున్నారు. ‘పరీక్షా పే చర్చా’ లో భాగంగా విద్యార్థులు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలను వివరించారు. బ్రేక్‌పాస్ట్‌లో మిల్లెట్స్ చేర్చాలని తద్వార శరీరం యాక్టివ్‌గా ఉంటుందన్నారు. వేరుశనగలు, గ్రీన్‌టీ లాంటివి ఒత్తిడికి చెక్ పెడతాయని తెలిపారు. తీపి పదార్థాల వల్ల ఒత్తిడి పెరుగుతుందని వాటికి దూరంగా ఉండాలన్నారు.

మెగాస్టార్ చిరంజీవి-వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీ విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోషియో ఫాంటసీ జానర్ కావడంతో VFX వర్క్ కీలకం కానుంది. ఇప్పటి వరకూ చేసిన VFXను మరింత మెరుగుపరిచేందుకు మూవీ టీమ్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. వేసవికల్లా అవి పూర్తయ్యే ఛాన్స్ లేకపోవడంతో విడుదల వాయిదా పడొచ్చన్న టాక్ సినీవర్గాల్లో నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక విమర్శలపై నీతా అంబానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించాలని చూస్తారు. మేమూ అదే చేశాం. చెప్పాలంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌ను అందరికీ తెలియజేశాం. ఆ వేడుక సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.

AP: అన్నమయ్య(D)లో యువతిపై <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. కదిరి TDP MLA వెంకట ప్రసాద్ అనుచరుడు మురళీ కుమారుడు గణేశ్ యాసిడ్ దాడి చేశాడని పేర్కొంది. టీడీపీ నేత కావడంతో రాజీ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ఆడబిడ్డపై యాసిడ్ పోసిన దుర్మార్గుడికి వత్తాసు పలుకుతారా అని CBN, అనిత, పవన్‌లను ప్రశ్నించింది. TDP నేతలతో మురళీ దిగిన ఫొటోలను షేర్ చేసింది.

TG: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తాజాగా క్లాస్ పీకారు. ‘మన సర్కారు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అయినా సరే సరైన మైలేజీ రావడం లేదు. మనం చేస్తున్న మంచిపనులు, పథకాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. నేతలు, కార్యకర్తలు అలకలు వీడాలి. సమష్టిగా పార్టీ కోసం కృషి చేసి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాల్ని వివరించాలి’ అని సూచించారు.

TG: తెలుగు రాష్ట్రాల్లోని అగ్రనాయకులు యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని CM రేవంత్ తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ ఆ కోవకే చెందుతారన్నారు. యూత్ కాంగ్రెస్‌కు ఉన్న శక్తి అలాంటిదని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే గుర్తింపు, అవకాశాలు వస్తాయని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటం ఆపొద్దని యువ నేతలకు సూచించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, 55వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.