India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి అయ్యసామి డిగ్రీ చదువుతున్నారు. ఇటీవల తనకిష్టమైన బుల్లెట్ బైకుపై కాలేజీకి వెళ్లొస్తుండగా ముగ్గురు అగ్రవర్ణ యువకులు అతడిపై దాడి చేశారు. ‘కులం తక్కువవాడివి.. మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాలా?’ అని కత్తులతో రెండు చేతులను నరికేశారు. అంతటితో ఆగకుండా సామి ఇంటినీ ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఏఐ సహాయంతో కొందరు క్రియేట్ చేసిన స్టార్ క్రికెటర్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్లు పొడవాటి జుట్టుతో ఉంటే ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు. కోహ్లీ, రోహిత్, బట్లర్, కేఎల్ రాహుల్, బాబర్ ఆజమ్, విలియమ్సన్ వంటి ప్లేయర్ల ఫొటోలను ఉపయోగించారు. ఈ ఫొటోలు చూసిన క్రికెట్ లవర్స్ సూపర్ అంటున్నారు. లాంగ్ హెయిర్‌తో తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలు అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,154 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఏసీ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. రూ.100 ఫీజు చెల్లించి www.rrcecr.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్‌కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు తులసిబాబు తన గుండెలపై కూర్చొని దాడి చేశాడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

AP: ప్రేమికుల దినోత్సవం నాడు అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. గుర్రంకొండ మం. ప్యారంపల్లికి చెందిన ఓ యువతికి (23)కి ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేశ్ సైకోలా మారాడు. ఇక ఆమె తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు. యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి వాలంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను ఈనెల 24న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది.

పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోళ్లు నేలచూపులు చూస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయినా గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 70-80 % వరకు అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్‌ల పెంపుతో పెట్టుబడిదారులంతా పసిడి వైపు మొగ్గుచూపడంతో ధరలు పెరిగాయి. ఫలితంగా గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 87,050గా నమోదైంది. ఈ ఏడాది ఏకంగా 10% పసిడి ధర పెరగడం గమనార్హం.

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌లో ఎంబైపీసీ(ఎంపీసీ, బైపీసీ) కోర్సు అమలుకు విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సు చదివిన వారు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్‌లలో ఏదైనా కోర్సులో జాయిన్ కావొచ్చు. గణితం ఒకే సబ్జెక్టుగా, బోటనీ-జువాలజీ కలిసి బయాలజీగా మార్పు చేయనున్నారు. మొదటి సబ్జెక్టుగా ఇంగ్లిష్‌తో కలిపి 5 సబ్జెక్టులు, ఆరోది ఆప్షనల్‌గా ఉండనుంది. ఆర్ట్స్ గ్రూపుల్లో అయితే 5 సబ్జెక్టులే ఉంటాయి.

TG: బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. రసూల్‌పురాలోని పలు చికెన్ షాపులపై దాడులు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో కుళ్లిన చికెన్ అమ్ముతున్నట్లు గుర్తించి, 5 క్వింటాళ్ల మాంసాన్ని సీజ్ చేశారు. మరోవైపు నల్గొండకు మంచినీరు సరఫరా అయ్యే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను వేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.