India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మహారాజా పద్మనాభ్ సింగ్‌కు 12ఏళ్ల వయసులోనే రాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రస్తుతం 26ఏళ్ల వయసులో రూ.20వేల కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు. ఇంత డబ్బున్నా చదువుతో పాటు క్రీడలను వదల్లేదు. పోలో ఆటలో నైపుణ్యం సాధించి 2017లో IND జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. వారసత్వ కట్టడమైన సిటీ ప్యాలెస్‌ను పర్యాటకుల కోసం ఉంచారు. తల్లితో కలిసి మహిళలకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.

ఈ ఏడాది IPL షెడ్యూల్‌కు సంబంధించిన కీలక వివరాలను క్రిక్‌బజ్ వెబ్‌సైట్ వెల్లడించింది. ‘బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న(శనివారం) కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. గత ఏడాది రన్నరప్ టీమ్ సన్‌రైజర్స్ తర్వాతి రోజు మధ్యాహ్నం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద తలపడనుంది. ఇక మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది’ అని పేర్కొంది.

కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ ‘మ్యాక్స్’ ఈ నెల 15న ఓటీటీలోకి రానుంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించి సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. అదే రోజు రాత్రి 7.30కు జీ కన్నడ ఛానల్‌లో ప్రసారం చేస్తామని పేర్కొంది. DEC 25న విడుదలై ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది.

AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.

‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.

మణిపుర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

సికింద్రాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చే భవనాలు ఇవి. ఎన్నో ఏళ్లుగా ప్రయాణికుల గుండెల్లో, సినిమాల్లో కనిపించిన ఈ రైల్వే స్టేషన్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఎన్నో ప్రయాణాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. స్టేషన్ అభివృద్ధిలో భాగంగా వీటి స్థానంలో ₹700crతో ఎయిర్‌పోర్టులా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాత భవనాలను గుర్తు చేసుకుంటూ ప్రయాణికులు ఎమోషనల్ అవుతున్నారు.

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతిచ్చింది. నిందితులు శ్రీవైష్ణవి డెయిరీ డైరెక్టర్లు వివేక్ జైన్, పోమిల్ జైన్, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, అపూర్వ చావ్డాలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అదేరోజు కోర్టులో హాజరుపరిచారు.

తమిళనాడులో పర్యటిస్తున్న Dy.CM పవన్ కళ్యాణ్‌ను మధురైలో ‘OG’ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా నందన్‌ను పవర్ స్టార్ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా OG చిత్రాన్ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కృష్ణలంక స్టేషన్లో పోలీసుల విచారణ ముగిసింది. 8గంటల పాటు అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన్ను పీఎస్ నుంచి ప్రభుత్వాసుపత్రికి(జీజీహెచ్)కు వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. అనంతరం మేజిస్ట్రేటు వద్ద హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.