News August 15, 2024

సచిన్ రికార్డు బ్రేక్ చేసేది అతడే: పాంటింగ్

image

టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ బ్రేక్ చేస్తాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం టెస్టుల్లో రూట్ 12,027 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా సచిన్ 15,921 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. పాంటింగ్(13,378), కల్లిస్(13,289), ద్రవిడ్(13,288), కుక్(12,472), సంగక్కర(12,400) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

News August 15, 2024

రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జనగణమన’ ఇదే!

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయగీతం ‘జనగణమన’ రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్‌ను ‘నోబెల్’ కమిటీ గుర్తుచేసుకుంది. ఆయన స్వయంగా ఆంగ్లంలో రాసిన ‘జన గణ మన’ పత్రాన్ని ట్విటర్‌లో పంచుకుంది. మొదట 1911లో బెంగాలీలో ‘భారోతో భాగ్యో బిధాత’గా కంపోజ్ చేయగా 1950లో భారత రాజ్యాంగం దీనిని జాతీయగీతంగా ఆమోదించింది. 1913లో ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

News August 15, 2024

కోర్టు తీర్పు తర్వాత వినేశ్ ఫొగట్ తొలి పోస్టు

image

కోర్టు తీర్పు తర్వాత భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ తొలి పోస్టు చేశారు. ఏడుస్తున్న ఫొటోకు ఎమోషనల్ సాంగ్‌ను జత చేశారు. కాగా సిల్వర్ మెడల్ కోసం ఆమె చేసిన అప్పీల్‌ను నిన్న CAS డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు 100గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఖాయమనుకున్న పతకం భారత్‌కు దూరమవ్వగా దేశ ప్రజల గుండెలు బరువెక్కాయి.

News August 15, 2024

ఇంత దిక్కుమాలిన సీఎంను ఎప్పుడూ చూడలేదు: హరీశ్ రావు

image

ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో <<13863027>>రేవంత్<<>> రెడ్డిలాంటి దిగజారిన, దిక్కుమాలిన సీఎంను చూడలేదని హరీశ్ రావు ఫైరయ్యారు. ‘నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి? సీఎంగా దేవుళ్ల మీద ప్రమాణం చేసి మాట తప్పావ్, దైవ ద్రోహానికి పాల్పడ్డావ్’ అంటూ ధ్వజమెత్తారు.

News August 15, 2024

‘ఫ్లాగ్ అంకుల్’ గురించి తెలుసా?

image

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే గుర్తొచ్చేది జాతీయ జెండా. రోజుకు 1.5 లక్షల జెండాలను నేస్తోన్న ఢిల్లీకి చెందిన ‘ఫ్లాగ్ అంకుల్’ అబ్దుల్ గఫార్ గురించి తెలుసా? 71 ఏళ్ల గఫార్ 60 ఏళ్లుగా జెండాలు తయారుచేస్తున్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు సమీపిస్తున్నాయంటే ఆయన దుకాణం దేశభక్తికి చిహ్నంగా మారుతుంది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంతో డిమాండ్ పెరిగిందని, తన బృందం 24 గంటలు పనిచేస్తోందని ఆయన తెలిపారు.

News August 15, 2024

దినేశ్ కార్తీక్ టీమ్‌లో ధోనీకి నో ప్లేస్!

image

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తన ఆల్ టైమ్ ఇండియా ప్లేయింగ్ 11ను ప్రకటించారు. ఇందులో రోహిత్, కోహ్లీలకు చోటివ్వగా, ఎంఎస్ ధోనీని ఎంపిక చేయకపోవడం గమనార్హం.

DK టీమ్: సెహ్వాగ్, రోహిత్ శర్మ, ద్రవిడ్, సచిన్, కోహ్లీ, యువరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్, అనిల్ కుంబ్లే, బుమ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్(12th man).

News August 15, 2024

మూత్రం ఆపుకుంటున్నారా? చాలా ప్రమాదం!

image

ప్రయాణంలోనో, పనిలో ఉండటం వల్లో చాలామంది మూత్ర విసర్జన ఆపుకొంటుంటారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ‘సాధారణంగానే మూత్రంలో క్రిములుంటాయి. ఆపుకోవడం వల్ల అవి మరింత పెరిగి మూత్రనాళ ఇన్ఫెక్షన్‌కు దారి తీయొచ్చు. మూత్రాశయ సంచి సాగిపోవడం, పెల్విక్ కండరాలు బలహీనపడి మూత్రంపై నియంత్రణ కోల్పోవడం వంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి యూరిన్‌ను ఎప్పుడూ ఆపుకోకూడదు’ అని సూచిస్తున్నారు.

News August 15, 2024

ప్రధాని మోదీకి రాహుల్ విజ్ఞప్తి

image

మణిపుర్‌ను సందర్శించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ Xలో మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న మణిపుర్ ప్రజలతో సమావేశమైనట్లు తెలిపారు. ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తమ ముఖాలను చూపొద్దని వారు కోరినట్లు పేర్కొన్నారు. దీంతో వారితో చేతులు కలిపిన ఫొటోను ఆయన పంచుకున్నారు. స్థానికంగా జాతుల మధ్య ఘర్షణతో మణిపుర్‌లో నేటికీ శాంతి పరిస్థితులు నెలకొనలేదని పేర్కొన్నారు.

News August 15, 2024

సెబీ చీఫ్ రాజీనామా చేయబోతున్నారా?

image

సెబీ చీఫ్ మాధబి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2 రోజులుగా ఢిల్లీలో PMO అధికారులతో ఆమె వరుసగా సమావేశం అవుతున్నారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సుప్రీం కోర్టు మళ్లీ విచారణకు ఆదేశిస్తే ఇరుకున పడతామని కేంద్రం భావిస్తోందని బిజినెస్ వరల్డ్ రిపోర్టు చేసింది. 2025 మార్చి వరకు పదవీకాలం ఉన్నా ఆమెతో రాజీనామా చేయించొచ్చని తెలిపింది. SBI ఛైర్మన్ దినేశ్ కుమార్‌ కొత్త చీఫ్ రేసులో ముందంజలో ఉన్నారంది.

News August 15, 2024

కీర్తిచక్ర పొందిన తొలి తెలుగు వ్యక్తి!

image

AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్‌గోపాల్ నాయుడికి కీర్తిచక్ర పురస్కారం వరించింది. నేడు రాష్ట్రపతి అవార్డు అందించనున్నారు. 2023 అక్టోబర్ 26న J&Kలోని కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన బృందానికి రామ్ నాయకుడిగా ఉన్నారు. టెర్రరిస్టులను ఏరివేయడంతో పాటు తన టీంను కాపాడటంతో కేంద్రం ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ ఘనత తెలుగు సమాజానికే గర్వకారణం అని కేంద్రమంత్రి రామ్మోహన్ కొనియాడారు.