India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.

తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్‌సేన్ నెటిజన్లను కోరారు. తాను మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పోస్టర్ నెల రోజుల క్రితం విడుదలైందని, రెడ్ సూట్ ఫొటో కూడా ఇప్పటిది కాదని చెప్పారు. ‘ప్రతీసారి తగ్గను. కానీ నిన్న మనస్ఫూర్తిగా <<15423495>>సారీ<<>> చెప్పాను. అతిగా ఆలోచించొద్దు. శాంతంగా ఉండండి. అసభ్య పదజాలం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైలాను బాయ్‌కాట్ చేయాలన్న ఆలోచనను బాయ్‌కాట్ చేయండి’ అని X పోస్ట్ పెట్టారు.

TG: రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ <<15416781>>డిమాండ్<<>> పెరుగుతున్న నేపథ్యంలో TGSPDCL అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై చర్చించారు. రానున్న రోజుల్లో డిమాండ్ ఎంత పెరిగినా రెప్పపాటు అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా 1912 టోల్ ప్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ మూవీలోని దబిడి దిబిడి సాంగ్‌లో స్టెప్పులపై చాలా విమర్శలొచ్చాయి. నటి ఊర్వశీ రౌతేలా ఓ ఇంటర్వ్యూలో వాటి గురించి స్పందించారు. ‘ఆ పాటకు మేం రిహార్సల్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడూ ఎబ్బెట్టుగా అనిపించలేదు. బాలయ్య అభిమానుల్ని అలరించేందుకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ అలా డిజైన్ చేశారు. కానీ రిలీజయ్యాక జనంలో అంత విమర్శలు వస్తాయని మేం ఊహించలేదు’ అని వెల్లడించారు.

మహిళా క్రికెటర్ షోహ్లీ అఖ్తర్(36)పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐదేళ్ల నిషేధాన్ని విధించింది. 2023లో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఆమె మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. జమునా టీవీ అనే వార్తాసంస్థ ఆ ఏడాది ఈ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను బయటపెట్టింది. తొలుత ఆరోపణల్ని అంగీకరించని షోహ్లీ, ఆ తర్వాత ఒప్పుకున్నారు. దీంతో ఆమెపై BCB నిషేధాన్ని విధించింది.

భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. ‘15 ఏళ్లు దాటిన భార్యతో భర్త చేసే ఏ శృంగారాన్నీ అత్యాచారంగా పరిగణించలేం. ఆమె ఒప్పుకోనప్పటికీ అసహజ శృంగారానికీ ఇది వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. అసహజ శృంగారం కారణంగా ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అతడికి కింది కోర్టులో శిక్ష పడగా హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో ఆయన భారత సైన్యాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ కేసు పెట్టారు. ఆ కేసు విచారణను స్వీకరించిన కోర్టు, వచ్చే నెల ఆఖరి వారంలో విచారణకు హాజరుకావాలని రాహుల్‌ని ఆదేశించింది.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

1713: మొఘల్ చక్రవర్తి జహందర్ షా మరణం
1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
1809: అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
1962: సినీ నటుడు జగపతిబాబు జననం
1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం
Sorry, no posts matched your criteria.