India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడితే మాజీ సీఎం, ఆ పార్టీ నేత ఆతిశీ <<15403368>>డాన్స్<<>> చేయడం సిగ్గుచేటని ఎంపీ స్వాతి మాలీవాల్ ట్వీట్ చేశారు. సీనియర్ నేతలంతా పరాజయం పాలైతే ఆతిశీ మాత్రం తనకేమీ పట్టనట్లు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. పార్టీ ఓటమిపై కేజ్రీవాల్ కుమిలిపోతుంటే ఆమెకు మాత్రం ఎలాంటి బాధ లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఆమె సిగ్గు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అసెంబ్లీ సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం లేకనే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయని శివసేన(UBT) ఎంపీ సంజయ్‌రౌత్ అన్నారు. కలిసి పోటీచేస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ఇండియా కూటమిలో అంతర్గత కలహాలు బీజేపీకి లాభం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని చెప్పారు. ఇండియా అలయెన్స్ ప్రస్తుతం ఉందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలిపారు.

AP: రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చడంలో CM చంద్రబాబు ఊసరవెల్లినే మించిపోయారని YCP నేత కన్నబాబు ఎద్దేవా చేశారు. మోదీ డిక్టేటర్ అంటూ గతంలో తిట్టిన చంద్రబాబు ఇప్పుడు రైట్ లీడర్ అంటూ పొగడడం దారుణమన్నారు. ‘కేజ్రీవాల్ ఓడిపోగానే బాబు కొత్త రాగం అందుకున్నారు. గతంలో మోదీ హఠావో.. దేశ్ బచావో అంటూ విమర్శించారు. పీఎంపై చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డు అయ్యాయి. ప్రజలు అంత సులువుగా మర్చిపోరు’ అని ఫైర్ అయ్యారు.

TG: కులగణన పూర్తిగా తప్పుల తడక, చిత్తు కాగితంతో సమానమని కేటీఆర్ విమర్శించారు. రీసర్వే చేసి సరైన లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు తామూ చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. బీసీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం మాట్లాడారు. ఈ సర్వేలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే పాల్గొనాలని కాంగ్రెస్ తొలుత చెప్పినట్లు గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీని కింద ఒక నెల జీతం(గరిష్ఠంగా రూ.15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్‌పై ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ELIకి అర్హత సాధించిన వారు ఈ నెల 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ పూర్తి చేయాలని EPFO తెలిపింది.

యూపీలోని సహరన్‌పూర్ జిల్లా జైల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని విడిచిపెట్టాలని ఆదేశిస్తూ ‘రాష్ట్రపతి కోర్టు’ పేరిట జైలు అధికారులకు లేఖ వచ్చింది. ఇదేం కోర్టు అంటూ వారు ఆరా తీయగా అసలు అలాంటి న్యాయస్థానమే లేదని తేలింది. దీంతో ఎవరో తప్పుడు పత్రాలతో ఆదేశాలు సృష్టించారని అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ తన ఎట్రాక్టింగ్ కళ్లతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా సినిమాల్లో ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెరిసే కళ్లు, పూస దండలు, ముక్కు పుడక, లైట్ గ్రీన్ చుడీదార్‌లో ఆమె చాలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. తన కొత్త జర్నీ ప్రారంభమైందని, తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆమె ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.

TG: రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే ఎకరా వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం రూ.6 వేల చొప్పున జమ చేసింది. గతంలోలాగా ఎకరా, రెండు ఎకరాలు, 3 ఎకరాలకు విడతల వారీగా రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి డబ్బులు ఖాతాల్లో వేసినట్లు సమాచారం.

అమెరికాలో స్థిరపడిన బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ దంపతులపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వలసదారుల్ని పంపించే కార్యక్రమంలో భాగంగా హ్యారీని కూడా దేశం నుంచి బయటికి తరలిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ‘ఆయన ఆల్రెడీ భార్యతో తిప్పలు పడుతున్నాడు. అందువల్ల అతడ్ని వదిలేస్తున్నాను’ అంటూ బదులిచ్చారు. హ్యారీ భార్య మేఘన్‌కు, ట్రంప్‌కు ఒకరంటే ఒకరికి పడదు. పలుమార్లు తీవ్రంగా విమర్శించుకున్నారు.

ఈ నెల 19 నుంచి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి వివిధ కారణాల రీత్యా కమిన్స్, హేజిల్‌వుడ్, మార్ష్, స్టొయినిస్ సేవల్ని ఆస్ట్రేలియా కోల్పోయింది. అయితే, వారెవరూ లేకపోయినా తమ జట్టే ట్రోఫీని గెలుస్తుందని మాజీ ఆటగాడు వార్నర్ ధీమా వ్యక్తం చేశారు. ‘ICC టోర్నీల్లో మా జట్టు అద్భుతంగా ఆడుతుంది. కీలక సమయాల్లో ఎలా గెలవాలో వాళ్లకు తెలుసు. జట్టులోకి కొత్తగా ఎవరొచ్చినా అద్భుతంగానే ఆడతారు’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.