News August 14, 2024

LRS దరఖాస్తులు.. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండిలా!

image

TG: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం ఓ లాగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్లికేషన్ సమయంలో సమర్పించని డాక్యుమెంట్లను ఇందులో అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఇందుకోసం <>వెబ్‌సైట్‌లో<<>> సిటిజన్ లాగిన్‌లో ఓటీపీ నమోదు చేసి, సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్, లేఅవుట్ కాపీ తదితర ధ్రువపత్రాలు సమర్పించవచ్చని పేర్కొంది.

News August 14, 2024

ITBPలో 819 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన

image

ITBPలో 819 కానిస్టేబుల్(కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన(షార్ట్ నోటిఫికేషన్) విడుదలైంది. టెన్త్‌తో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌కు సంబంధించిన కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు. 18 నుంచి 25 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, SC, STలకు ఫీజు లేదు.

News August 14, 2024

17న ఢిల్లీకి సీఎం రేవంత్!

image

TG: CM రేవంత్ రెడ్డి ఈనెల 17న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News August 14, 2024

దేశ విభజన బాధితులకు అమిత్ షా నివాళి

image

చరిత్రను గుర్తుపెట్టుకున్న దేశమే భవిష్యత్తును నిర్మించుకొని శక్తిమంతంగా ఎదుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆగస్టు 14, దేశ విభజన గాయాల స్మృతి దినం నేపథ్యంలో ట్వీట్ చేశారు. ‘మన చరిత్రలోనే దారుణమైన రోజు ఇది. దేశ విభజనతో ప్రాణాలు, ఇళ్లు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన లక్షల మందికి ఇదే నా నివాళి. మోదీ నాయకత్వంలో జాతి నిర్మాణం కోసమే ఈ స్మృతి దినాన్ని నిర్వహిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News August 14, 2024

ఐటీ రీఫండ్ ఎవరికి త్వరగా వస్తుందంటే..

image

పదేళ్ల ముందు ఫైల్ చేసిన ఏడాదికి గానీ IT రీఫండ్ వచ్చేది కాదు. ఇప్పుడా సమయం చాలా తగ్గింది. ITR ఫారం, సంక్లిష్టత, సర్దుబాట్లను బట్టి 10-90 రోజుల్లోపే వచ్చేస్తోంది. సులువుగా ఉండే ITR1 వాళ్లకు 10 రోజుల్లోపే రీఫండ్ వస్తుంది. దీనికన్నా ITR2, దీంతో పోలిస్తే ITR3 సంక్లిష్టంగా ఉంటాయి. అన్నీ సవ్యంగా ఉంటే ముందు 2 తర్వాత 3 ఫారాలను ప్రాసెస్ చేసి రీఫండ్ చెల్లిస్తారు. సర్దుబాట్లు ఉంటే కొంత ఆలస్యం అవుతుంది.

News August 14, 2024

రూ.20 లక్షల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు

image

TG: నేటి నుంచి ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అదనపు సంచాలకురాలు డి.ఉమాదేవి తెలిపారు. తెలంగాణ <>ఈ-పాస్<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. కాగా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే నిరుపేద విద్యార్థులకు ఈ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రెండు విడతలుగా దీనిని అందజేస్తారు.

News August 14, 2024

నేడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు

image

AP: విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనంలో విధ్వంసం ఘటనపై ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్‌కు వైసీపీ నేతలు ఇవాళ ఫిర్యాదు చేయనున్నారు. ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, నందిగం సురేశ్, మొండితోక అరుణ్, కైలే అనిల్‌తో కూడిన బృందం ఈ ఘటనను వివరించనుంది. మహాశిల్పం వద్ద జరిగిన దాడిని విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనుంది.

News August 14, 2024

నేడు రాష్ట్రంలో OPలు బంద్

image

తెలంగాణలో ఇవాళ ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్‌కతాలో జూ.డాక్టర్‌ను రేప్ చేసి చంపిన <<13822185>>ఘటనను<<>> నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. దీనిపై జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. ఇవాళ ఆందోళనలో పాల్గొననున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. కాగా కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన చేస్తున్నారు.

News August 14, 2024

హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషస్

image

హిండెన్‌బర్గ్ రిపోర్టుపై మారిషస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ మండిపడింది. షెల్ కంపెనీల ఏర్పాటుకు తమ రూల్స్ అంగీకరించవని తెలిపింది. తమను ట్యాక్స్ హెవెన్‌గా వర్ణించేందుకు వీల్లేదంది. గ్లోబల్ బిజినెస్ కంపెనీల కోసం తమ వద్ద పటిష్ఠ వ్యవస్థలు ఉన్నట్టు చెప్పింది. రిపోర్టులో ప్రస్తావించిన IPE ప్లస్ ఫండ్, IPE ప్లస్ ఫండ్ వన్‌కు తమ లైసెన్సులు లేవంది. అవి మారిషస్ కేంద్రంగా ఏర్పాటైనవి కాదని వెల్లడించింది.

News August 14, 2024

గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు: BRS

image

TG: విదేశీ పర్యటన నుంచి ఇవాళ తిరిగివస్తున్న CM రేవంత్ రెడ్డికి BRS పార్టీ సెటైరికల్ స్వాగతం పలికింది. ‘పది రోజుల US పర్యటనలో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి గారు నూతనంగా స్థాపించిన కంపెనీతో రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వదేశానికి తిరిగివస్తున్న మా గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు. ఇట్లు బ్యాగ్‌మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అని ఈ బ్యానర్‌ను Xలో పోస్ట్ చేసింది.