India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటర్లను ఆకర్షించడానికి, ప్రత్యర్థులను కార్నర్ చేయడానికి పార్టీలు అనుసరించే వ్యూహాల్లో ‘నినాదం’ కీలకం. MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో BJP, కాంగ్రెస్ సంధించుకున్న నినాదాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అవి: ఏక్ హైతో సేఫ్ హై(ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం-మోదీ) *బటేంగే తో కటేంగే(విడిపోతే నష్టపోతాం- UP CM) *భయపడొద్దు- రాహుల్ గాంధీ *భయపడితే చస్తారు- INC *రోటీ-బేటీ-ఔర్ మట్టి (ఝార్ఖండ్ BJP)
కాంగ్రెస్ ఉద్ధృతంగా డిమాండ్ చేస్తున్న కులగణనకు కౌంటర్ ఇవ్వడానికి PM మోదీ ఏక్ హైతో సేఫ్ హై పిలుపునిచ్చారు. మతపరమైన కోణంలో UP CM యోగి బటేంగే తో కటేంగే నినాదమిచ్చారు. BJP విద్వేషపూరిత రాజకీయాలను ఎదుర్కొవడానికి భయపడొద్దు, భయపడితే చస్తారు అంటూ కాంగ్రెస్ నినదించింది. ఝార్ఖండ్‌లో చొరబాటుదారుల్ని ఎన్నికల అంశంగా మార్చి రోటీ-బేటీ-ఔర్ మట్టి అంటూ గిరిజనులపై BJP స్లోగన్ వదిలింది.
TG: కేసీఆర్ డైరెక్షన్‌తోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరీవాహకంలో మొద్దు నిద్ర చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా? ముందు ఆయన డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంపీగా కిషన్ రెడ్డి ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
TG: ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వెన్నెల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ప్రభుత్వ రంగ టెలికం ప్రొవైడర్ BSNL ఊపందుకుంటోంది. DOT ప్రకారం గత 2 నెలల్లోనే 65 లక్షల మంది కొత్త యూజర్లను పొందింది. ప్రైవేట్ ప్రొవైడర్లు విపరీతంగా రీఛార్జ్ ధరలు పెంచడంతో AIRTEL, JIO యూజర్లు BSNLలో చేరుతున్నట్లు DOT తెలిపింది. ఇదే సమయంలో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు 40 లక్షల యూజర్లను కోల్పోయాయి. కాగా, మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి సింధియా తెలిపారు.
కేంద్రం 25 ఏళ్ల తర్వాత తొలిసారి సీనియర్ సిటిజన్స్ పాలసీని రూపొందిస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు SR సిటిజన్స్ చట్టాన్నీ సవరిస్తుందని తెలిసింది. ఇందుకోసం TaskForce నియమించింది. ప్రస్తుతం 15.6 కోట్లుగా ఉన్న వృద్ధ జనాభా 2050 నాటికి 34.6 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో సంస్కరణల అవసరం ఏర్పడింది. పట్టణాల్లో 26.7% వృద్ధులు భాగస్వామితో కలిసి పిల్లలకు దూరంగా బతుకుతున్నారని LASI అంచనా.
పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో టీ20లో ఆసీస్ 13 రన్స్ తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా తొలుత 20 ఓవర్లలో 147/9 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19.4 ఓవర్లు ఆడి 134 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. స్పెన్సర్ జాన్సన్ 5 వికెట్లతో చెలరేగారు. నామమాత్రపు చివరి టీ20 ఎల్లుండి హోబర్ట్‌లో జరుగుతుంది.
AP: రాష్ట్రంలో YCP హయాంలో వాలంటీర్ల ద్వారా 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందని TDP, JSP చేసిన ఆరోపణలు తప్పని తేలాయని మాజీ మంత్రి రోజా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇది బట్టబయలైందని ఆమె చెప్పారు. ‘గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 నమోదయ్యాయని స్వయంగా హోంమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్తారా? అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
AP CM చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చివరి ఫొటో బయటకొచ్చింది. HYD AIG ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మ.12.45 గంటలకు <<14625616>>తుదిశ్వాస <<>>విడిచారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మృతిపట్ల టీడీపీ శ్రేణులు, నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.