India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి ఇప్పటికి రెండు పాటలు విడుదల కాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లవర్స్‌కు ఆ మూవీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ థాంక్స్ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా దేవర పాటలకు మీరు ఇస్తున్న క్రేజీ లవ్‌కు థాంక్యూ. మనం ఇప్పుడే మొదలుపెట్టాం. మున్ముందు ఇంకా చాలా వస్తాయి’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేవర నుంచి ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ పాటలు విడుదలయ్యాయి.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 11 వరకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.inలో తెలుసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
AP: వచ్చే ఐదేళ్లలో అమరావతి పేరుతో IPL టీమ్‌ను ప్రమోట్ చేస్తామని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. ‘అన్ని విద్యాసంస్థల్లో ప్రతి రోజూ గంటపాటు క్రీడలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడా మైదానాలు లేని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో రూ.120 కోట్ల అవినీతికి పాల్పడింది’ అని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్‌లో రీఎంట్రీకి షేక్ హసీనా రంగం సిద్ధం చేసుకుంటున్నారని జియో పొలిటికల్ అనలిస్టుల అంచనా. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేక, తన ప్రజల అంత్యక్రియల పర్వాన్ని చూడొద్దనే పదవి నుంచి దిగిపోయానన్న ఆమె మాటల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒకవేళ యూనస్ ప్రభుత్వం దీవిని USకు అప్పగిస్తే మళ్లీ ఎన్నికల్లో ఇదే అవామీ లీగ్ ప్రచారాస్త్రం అవుతుందని, ప్రజలు ఆలోచిస్తారని చెబుతున్నారు.
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో ₹50లక్షల ఖరీదైన వాచ్ ధరించినట్లు ఫొటోల్లో కనిపించింది. దీంతో అతడి ఆస్తి, సంపాదన ఎంతనే చర్చ మొదలైంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం నీరజ్ నికర ఆస్తులు సుమారు ₹37కోట్లు. నెలకు సగటున ₹30 లక్షలు, ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం అని తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ గెలిచాక నీరజ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు భారీగా అందుతున్నాయి.
ఐరోపా ఖండంలో వేడి కారణంగా గత ఏడాది 47వేలమందికి పైగా మృతిచెందారని బార్సిలోనా ఐఎస్ గ్లోబల్ హెల్త్ నివేదిక వెల్లడించింది. ఉష్ణోగ్రతల నమోదు మొదలయ్యాక యూరప్‌నకు నిరుడు అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. 60 వేల మరణాలుంటాయని అంచనా ఉన్నప్పటికీ ఆరోగ్య రంగ సేవలు మెరుగవుతుండటంతో మరణాలు తగ్గినట్లు నివేదిక వివరించింది. ఎక్కువ మరణాలు గ్రీస్, బల్గేరియా, ఇటలీ, స్పెయిన్ నుంచి ఉన్నట్లు తెలిపింది.
TG: అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే కుమారుడూ చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన భూపాలపల్లి(D) పెద్దంపేటలో జరిగింది. బీసుల పెద్ద లస్మయ్య(62) సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కొడుకు కృష్ణంరాజు(30) తల్లడిల్లిపోయాడు. రోదిస్తూనే అంత్యక్రియలు చేసిన అతను సాయంత్రం హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు.
2011 లెక్కల ప్రకారం 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036 నాటికి 152 కోట్లకు చేరనుంది. గణాంకాల శాఖ నివేదిక ప్రకారం పనిచేసే(15-59ఏళ్లు) వారి సంఖ్య 64.9 శాతానికి(గతంలో 60.7%) చేరనుంది. 2011లో లింగ నిష్పత్తి 1000:943 ఉండగా, 2036కు 1000:952కు పెరగనుంది. పట్టణ జనాభా 37.7కోట్ల నుంచి 59.4కోట్లకు, గ్రామీణ జనాభా 83కోట్ల నుంచి 92కోట్లకు చేరనుంది. 15ఏళ్ల లోపు వారి సంఖ్య తగ్గి 60ఏళ్లు పైబడే వారి సంఖ్య పెరగనుంది.
బంగ్లాలో పరిస్థితుల్ని US నిరంతరం పర్యవేక్షిస్తోందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇంతకు మించి చెప్పేదేమీ లేదంది. ఎలాంటి మానవ హక్కుల అంశమైనా జో బైడెన్ ఎప్పుడూ గట్టిగా, స్పష్టంగానే మాట్లాడతారని నొక్కి చెప్పింది. హిందువులు, మైనారిటీలపై దాడుల్ని అడ్డుకోవాలని కొన్ని రోజులుగా అమెరికన్ హిందూ సంఘాలు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రకటనలో మైనారిటీలు, హిందువులు అన్న పదాలే లేకపోవడం గమనార్హం.
ఈరోజు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. మనిషికి ఉండే రెండు చేతుల్లో ఏది ముఖ్యమని అడిగితే రెండూ ముఖ్యమే అంటారు. కానీ ఎడమచేతిపై వివక్ష ఎప్పటికీ ఉంటుంది. మహిళల్లో ఈ పట్టింపు మరీ ఎక్కువ. ఇంట్లో ఆడపిల్లలు ఎడమ చేత్తో వండినా, వడ్డించినా ఆఖరికి మంచినీళ్లిచ్చినా ఈసడింపుగా చూస్తారు. అందుకే లెఫ్ట్ హ్యాండర్స్‌కు ఈ సమాజం నుంచి కొన్ని సవాళ్లు ఎక్కువే. దీనిపై మీ అభిప్రాయం?
Sorry, no posts matched your criteria.