News November 15, 2024

పాకిస్థాన్‌కు చేరిన ఛాంపియన్స్ ‘ట్రోఫీ’

image

ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చుట్టూ అనిశ్చితి నెలకొని ఉండగా మరోవైపు ICC మాత్రం మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్త ప్రదర్శన నిమిత్తం ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌కు పంపింది. ప్రపంచంలోనే రెండో ఎత్తైన పర్వతం K2 శిఖరానికి కూడా ఈ ట్రోఫీని తీసుకెళ్లనున్నారు. కాగా ఈ టోర్నీ కోసం పాక్‌కు వెళ్లేందుకు ఇండియా No చెప్పడంతో దీని నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News November 15, 2024

కపిల్‌శర్మ షో నుంచి అందుకే బయటికొచ్చా: సిద్ధూ

image

కపిల్‌శర్మ షో నుంచి నిష్క్రమించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు మౌనం వీడారు. రాజకీయాల వల్లే తాను షో నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. అంతకంటే ఎక్కువ వివరించకూడదని చెప్పారు. 2019లో ఈ షో నుంచి సిద్ధూ నిష్క్రమించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే పుల్వామా దాడి గురించి ఆయన ‘ఉగ్రవాదులకు మతాలు లేవు’ అని చేసిన వ్యాఖ్యల వల్లే షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

News November 15, 2024

నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

* 1949: నాథూరామ్ గాడ్సే మరణం.
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం.
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం.
* 2000: బీహార్ నుంచి ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో).

News November 15, 2024

IPL: 2 సెట్లుగా టాప్ క్రికెటర్ల వేలం

image

IPL మెగా వేలం Nov 24, 25ల్లో జరగనున్న నేపథ్యంలో ప్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రిటైన్ కానివారు, కొత్త క్రికెటర్లు వేలంలో పాల్గొనున్నారు. అయితే ఈ వేలంలోని టాప్ క్రికెటర్లను 2 సెట్లుగా విభజించినట్లు BCCI తెలిపింది. పంత్, రాహుల్, శ్రేయస్, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్, అశ్విన్, స్టార్క్, బట్లర్‌ వంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉంటారు. ప్రతి సెట్లో 8-9 మంది టాప్ క్రికెటర్లుంటారు.

News November 15, 2024

ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్‌జెండర్లు: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారి సేవలు వినియోగించాలని సూచించారు. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని చెప్పారు. డ్రంక్&డ్రైవ్‌ కోసం వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వీలైనంత త్వరగా దీన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అదేశించారు.

News November 15, 2024

తెలుగు టైటాన్స్ ఓటమి

image

ప్రోకబడ్డీ లీగ్‌ సీజన్‌-11లో భాగంగా UP యోధాస్‌తో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓడింది. ఫస్ట్ హాఫ్‌ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్ 20-16తో ఆధిక్యం కనబర్చింది. అయితే ఆ తర్వాత UP ఆటగాళ్లు పుంజుకున్నారు. చివరికి UP 40 పాయింట్లు సాధించగా టైటాన్స్ 34 పాయింట్లకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్(32)పై U ముంబా(35) గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో హరియాణా ఉండగా టైటాన్స్ 6వ స్థానంలో ఉంది.

News November 15, 2024

ఈ నెల 19న ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన

image

TG: ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలకు సీఎం రేవంత్ వరంగల్ వేదికగా ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నారు.

News November 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 15, 2024

రంగులు మారే శివలింగం ఎక్కడుందంటే?

image

తమిళనాడు రాష్ట్రం అతిపురాతన ఆలయాలకు నిలయం. ఇక్కడ సైన్స్‌కు చిక్కని ఎన్నో రహస్యాలు, సంపదలున్న ఆలయాలున్నాయి. ఇందులో తిరునళ్లూరులో ఉండే శ్రీ పంచ వర్ణేశ్వరాలయం ఒకటి. ఇక్కడున్న శివలింగం ఒక్క రోజులోనే 5 రకాల రంగుల్లో మారుతుంటుంది. లింగాన్ని రాగి, పింక్, గోల్డెన్, ఆకుపచ్చ, అనౌన్ కలర్‌లో చూడొచ్చు. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే కైలాసగిరి ప్రదక్షిణం చేసినట్లేనట.

News November 15, 2024

మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమే!

image

ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాల్సిందే. అయితే, తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో తెలుసా? 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రంజనా సోనావానే అనే మహిళకు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. కాగా, భారత తొలి ఫైవ్ స్టార్ హోటల్ ముంబై తాజ్ హోటల్. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ట్రైన్, ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ IIT రూర్కీ కావడం విశేషం.