India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనత సాధించారు. ఒడిశాలో 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి ‘లార్జెస్ట్ సింగింగ్ లెసన్’ పేరిట జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఈ రికార్డింగును ఈ నెల 14న సా.5 గంటలకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. వేణుగాన విద్వాంసులు హరి ప్రసాద్ చౌరాసియా, రాకేశ్, వీణ మాస్ట్రో జయంతి తదితరులు ఇందులో భాగమయ్యారు.
AP: కదులుతున్న రైలు ఎక్కబోయి చక్రాల కిందపడి ఏపీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరుకు చెందిన హర్షవర్ధన్(22) తిరుపతిలో బీటెక్ చదువుతున్నాడు. అతను తమిళనాడులోని కాంచీపురం కామాక్షమ్మ గుడికి వెళ్లి తిరిగొస్తూ తిరుత్తణి రైల్వే స్టేషన్‌లో దిగాడు. రైలు బయలుదేరడంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కే క్రమంలో కిందపడ్డాడు. చక్రాల కింద పడి శరీరం రెండు ముక్కలైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: పట్టణాల్లో పశువులకు మేత దొరక్కపోవడంతో వాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అవి ప్రాణాలు వదులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలు తిని ఆవు, కడుపులోని దూడ మరణించాయి. పశువైద్యులు ఇంజక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించినా ఫలితం లేకపోయింది. చాలా పట్టణాల్లో ఇలా రోడ్లపై వదిలేయడం వల్ల రాత్రిపూట యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్ అతిథి గృహం వరకు భక్తులు లైన్‌లో వేచి ఉన్నారు. నిన్న 79,313 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39,344 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం నిన్న రూ.3.65కోట్లు వచ్చింది.
TG: ఆసిఫాబాద్(D) గుండాయిపేటకు చెందిన పూజ (16) సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో టెన్త్ చదువుతోంది. వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి ‘జ్వరమొచ్చింది. కాళ్లూచేతులు గుంజుతున్నాయ్ నాన్నా. ఇంటికి తీసుకుపో’ అని చెప్పింది. తండ్రి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. నిన్న HYDకు తరలిస్తుండగా ‘నాన్నా.. నన్ను కాపాడు’ అంటూ తండ్రి చేయి పట్టుకుని వేడుకుంది. అయినా దేవుడు కరుణించలేదు. కాసేపటికే ప్రాణాలు వదిలింది.
తుంగభద్ర డ్యామ్ <<13826054>>గేట్<<>> కొట్టుకుపోవడంతో ముందు జాగ్రత్తగా అధికారులు అన్ని గేట్లు ఎత్తేశారు. లక్ష క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటక మంత్రి శివరాజ్ అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ నిపుణుల బృందం డ్యామ్‌ను పరిశీలించనుంది. గేట్ కొట్టుకుపోవడంతో కర్నూలులోని పలు మండలాలకూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రోజూ టిఫిన్‌గా ఇడ్లీ, దోశ తదితరమైనవి తినడం ఎక్కువమందికి అలవాటు. దీని వల్ల అరగంటలోనే మధుమేహం పెరిగిపోతుందని జీర్ణకోశ వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి ముందుగా ఏదైనా ఒక పండును తింటే టిఫిన్ తర్వాత షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని సూచిస్తున్నారు. పండ్లలో ఉండే పీచు పదార్థం కారణంగా ఆ తర్వాత తిన్న టిఫిన్ కూడా సులువుగా జీర్ణమవుతుందంటున్నారు. భోజనంలోనూ పండ్లు, కూరగాయల్ని భాగంగా చేసుకోవాలని పేర్కొంటున్నారు.
AP: ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, సంస్థలు ఉండగా 40 వరకు భర్తీ చేయొచ్చని సమాచారం. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఈ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తం పదవుల్లో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం.
వాకింగ్, జాగింగ్ రెండూ ఆరోగ్యంగా ఉండేందుకు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. రోజూ 30min చురుగ్గా వాకింగ్ చేస్తే 150-200 కేలరీలు, జాగింగ్ చేస్తే 300-400 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ ఏ వయసు వారైనా చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు, కాళ్ల నొప్పులు ఉన్న వారు, గుండె ఆపరేషన్లు అయినవారు జాగింగ్ కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
AP: డ్వాక్రా సంఘాల పొదుపులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 మార్చికి అన్ని రాష్ట్రాల పొదుపు ₹65,089cr కాగా దక్షిణాది పొదుపు ₹29,409cr. ఇందులో AP పొదుపు ₹17,292cr. ఇది దేశంలోనే అత్యధికం. ఆ తర్వాత TG(₹5,768cr), TN(₹2,854cr) కర్ణాటక(₹2,024cr) ఉన్నాయి. అలాగే APలో పొదుపు సంఘాలు 10,99,161 ఉండగా, ఒక్కో సంఘం సగటు పొదుపు ₹1,57,321. ఇది దేశంలోనే అత్యధికమని నాబార్డు నివేదికలో వెల్లడైంది.
Sorry, no posts matched your criteria.