India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైద్య విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను 15% పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ప్రస్తుతం ₹70,000 ఇస్తుండగా, ఇకపై ₹80,500 అందిస్తారు. MBBS హౌస్ సర్జన్స్‌కు ఇచ్చే ₹22,527లను ₹25,906కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకూ స్టైఫండ్ పెరిగింది.
AP: రాష్ట్రంలో శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీలను ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు ఎంత ఖర్చవుతుంది? సిబ్బంది ఎంత మంది కావాలి? అనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. HYDలో ఉన్న ఈ వర్సిటీలు విభజన చట్టం ప్రకారం ఈ ఏడాది జూన్ 2తో పదేళ్లు పూర్తయినందున ఏపీలో సేవలను నిలిపేశాయి. దీంతో ఈ ఒక్క ఏడాదికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం లేఖ రాసింది.
TG: నిజంగా పంట పండించే రైతులకు ‘రైతు భరోసా’ అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయబోమని రైతులతో సమావేశంలో చెప్పారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన వారి ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఎకరాకు రూ.15వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న అమన్(21) పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. మేనమామ సుధీర్ చేరదీయగా, రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. కోచ్ లలిత కుమార్ వద్ద శిక్షణ ప్రారంభించి 2021లో మొదటి జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్యం, 2023లో బంగారు పతకం సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏకైక పురుష రెజ్లర్‌గా నిలిచి సత్తా చాటారు.
TG: డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది. దోస్త్ స్పెషల్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్ట్ గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. నిన్నటితోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ముగియగా మరో నాలుగు రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
క్రీడలు ఇప్పుడు భవిష్యత్తును మార్చే శక్తివంతమైన సాధనంగా ఉన్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇవి దోహదపడుతాయని గోరఖ్‌నాథ్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్రంలో పోలీసు, ఇతర విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్: మెన్స్ ఫుట్‌బాల్ ఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌కు స్పెయిన్ షాకిచ్చింది. ఫైనల్ మ్యాచులో 5-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు 32 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో బంగారాన్ని అందుకుంది. మరోవైపు ఫ్రాన్స్ గోల్డ్ ఆశలు ఆవిరవ్వగా రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు కాంస్యం కోసం జరిగిన మ్యాచులో ఈజిఫ్టుపై మొరాకో విజయం సొంతం చేసుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పోటీలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజున భారత్ మరో పతకంపై ఆశలు పెట్టుకుంది. రెజ్లింగ్‌లో యువ అథ్లెట్ రితికా హుడా 76 కేజీల మహిళల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోల్ఫ్‌లో దీక్ష దగర్, అదితి అశోక్ బరిలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన పోటీల్లో భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు వచ్చాయి.
TG: సీపీగెట్-2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. సవరణలకు 26 వరకు అవకాశమివ్వగా 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయనున్నారు. అదే నెల 9న విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ SEP 15న మొదలుకానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కన్నూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలకు వెళ్లి వారిని కలవనున్నారు. పునరావాస పనుల పరిశీలనతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు.
Sorry, no posts matched your criteria.