India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అందించే రూ.15,000 కోట్ల <<14576900>>రుణంపై<<>> నేడు కీలక ముందడుగు పడనుంది. రుణ ఒప్పందాలపై ఢిల్లీలో సీఆర్డీఏ, బ్యాంకుల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఈ నిధులతో అమరావతిలో ప్రధాన రహదారులు, స్మార్ట్ వాటర్ డ్రెయిన్లు, కాలువలు, లిఫ్ట్ స్కీమ్‌లు, తాగునీటి సరఫరా, హైకోర్టు, సచివాలయం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల భవనాలను నిర్మిస్తారు.
భారత సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370 వంటి కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక తీర్పులిచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పదవీకాలం నవంబర్ 10న ముగిసింది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకమే PM E-DRIVE. దీనికింద ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీవీలర్స్(ఆటోరిక్షాలు), ట్రక్కులు, బస్సులకూ సబ్సిడీ వస్తుంది. బ్యాటరీ సామర్థ్యంపై సబ్సిడీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ-కార్లకు మాత్రం సబ్సిడీ రాదు. అయితే అధునాతన బ్యాటరీ అమర్చిన ఈవెహికిల్స్‌కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2026 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది.
తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో ఓ బహిరంగ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ తెలుగు ప్రజలు ప్రాచీన కాలంలో తమిళరాజులకు సేవ చేసిన మహిళలకు వారసులు అని వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పలు కేసులు నమోదవడంతో పాటు ఆమెకు లీగల్ నోటీసులు అందాయి. కాగా ఆమె ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచాఫ్ అయ్యింది.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ థాయిలాండ్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్, అడ్వైజర్‌గా నియమితులయ్యారు. సోనూసూద్ ఇమేజ్ భారత పర్యాటకులను ఆకర్షించడంలో తమకు దోహదపడుతుందని ఆ దేశం పేర్కొంది. కరోనా సమయంలో సోనూసూద్ సామాజిక, సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆ దేశానికి వెళ్లేందుకు భారత్ నిరాకరించిందని PCB తెలిపింది. ఈ మేరకు BCCI నుంచి లేఖ అందినట్లు వెల్లడించింది. మరి ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించే ఆలోచన చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఈరోజు విడుదల చేయాల్సి ఉండగా భారత్ ప్రాతినిధ్యం వహించడంపై స్పష్టత రాకపోవడంతో అది సాధ్యపడలేదు.
చలికాలంలో మారిన వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని, చల్లగా ఉండే వాటిని వీలైనంత వరకు తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మాంసాహారం తక్కువగా తీసుకోవాలని, డీప్ ఫ్రైలకు దూరంగా ఉండాలని అంటున్నారు.
NVIDIA సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి సంస్థకు CEOగా ఉన్న జెన్సెన్ హువాంగ్ వాచ్ పెట్టుకోరు. అందుకు కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘మీరు మా కంపెనీ ఉద్యోగుల్ని అడిగి చూడండి. మాకు దీర్ఘకాలం ప్లాన్స్ ఉండవు. ప్రస్తుతం మీద దృష్టి పెట్టడమే మా అజెండా. భవిష్యత్తు కాదు.. ముందు ఈ క్షణంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతోనే వాచ్ ధరించను’ అని వివరించారు.
US ఎన్నికల్లో ట్రంప్ గెలిచారని ఆందోళన చెందే దేశాల్లో భారత్ లేదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ‘చాలా దేశాలు ట్రంప్ గెలుపుపై ఆందోళన చెందాయి. భారత్‌కు అలాంటి టెన్షన్ లేదు. ఆయన గెలవగానే కాల్ చేసిన తొలి ముగ్గురిలో PM మోదీ కూడా ఉన్నారు. వారిద్దరికీ మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఇతర దేశాలతో బంధం బలోపేతం చేసుకోవడంలో ప్రధాని చేసిన కృషి భారత్‌కు ఉపకరించింది’ అని పేర్కొన్నారు.
లెబనాన్‌లో పేజర్ల ద్వారా దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లో జరిగిన ఈ పేలుళ్లలో దాదాపు 40 మంది హెజ్బొల్లా సభ్యులు మరణించారు. ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్ లేబర్ ఏజెన్సీకి లెబనాన్ ఫిర్యాదు చేసింది. మానవత్వంపై ఘోరమైన దాడిగా పేర్కొంది.
Sorry, no posts matched your criteria.