India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒలింపిక్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేయడంపై వినేశ్ ఫొగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో వేసిన కేసు రేపు విచారణకు రానుంది. ఆమె తరఫున వాదించడానికి ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వేను భారత ప్రభుత్వం నియమించింది. అయితే అందుకు ఆయన అంగీకరించాల్సి ఉంది. గతంలో పాక్ బందీ చేసిన కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించారు. అందుకు రూపాయి ఫీజు తీసుకున్నారు. హైప్రొఫైల్ కేసులు వాదించడంలో సాల్వే దిట్ట.
APలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష చేశారు. ‘జులైలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు రూ.36 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి. రెండేళ్లలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెంచాలి. నిమ్మ, టమాట, మామిడి పంటల విలువ పెంచేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలి’ అని CM సూచించారు.
శ్రావణ మాసంలోని శుక్ల పక్షం 5వ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. రేపు ఉదయం 06.01 నుంచి 8.37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అటు వేద పంచాంగం ప్రకారం పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12.36 గంటలకు ప్రారంభమై 10వ తేదీ తెల్లవారుజామున 03.14 గంటలతో ముగుస్తుంది.
AP: దక్షిణ భారత్‌కు మంగళగిరిని గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 25 ఎకరాల్లో ఈ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక స్వర్ణకారులకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు చేసేలా శిక్షణ ఇస్తామన్నారు. పద్మశాలీయ బహూత్తమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో భార్య బ్రాహ్మణితో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ సెమీస్‌లో అమన్ సెహ్రావత్ ఓడిపోయారు. వరల్డ్ నంబర్ వన్ సీడ్ హిగుచీ చేతిలో 0-10 తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో రేపు జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అమన్ బరిలోకి దిగనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఆసాంతం భారత గోల్‌పోస్ట్‌కు అతడు అడ్డుగోడలా నిలబడ్డారు. అయితే శ్రీజేశ్‌కు ఇదే చివరి మ్యాచ్. ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతానని అతడు గతంలోనే ప్రకటించారు. దీంతో ఇవాళ మ్యాచ్ ముగిసిన తర్వాత గోల్‌పోస్ట్ పైకి ఎక్కి కూర్చున్న అతడి ఫొటోలు వైరల్ అవతున్నాయి. ‘THANK YOU LEGEND’ అంటూ క్రీడాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా యూనస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే బంగ్లాలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. హిందువులతో పాటు ఇతర మైనార్టీల భద్రతకు భరోసా లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల అభివృద్ధికి బంగ్లాతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టం చేశారు.
TG: కొత్త రేషన్ కార్డుల జారీ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా మంత్రులు దామోదర రాజ నర్సింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.
AP: బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానం చేసిన వారి పార్థివదేహాలకు అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్/సీనియర్ అధికారి ఈ సంస్కారాల్లో పాల్గొనాలని ఆదేశించింది. దాతల కుటుంబాలకు ₹10,000 పారితోషికం, ప్రశంసా పత్రాలు అందించాలని మంత్రి సత్యకుమార్ చొరవతో ఉత్తర్వులు ఇచ్చింది. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి భౌతికకాయం ఉచితంగా తరలించాలంది.
రోజూ కోడిగుడ్డు తినడం ఆరోగ్యకరమని తెలుసు. కానీ, ఎన్ని గుడ్లు తినాలనే సందేహం చాలా మందిలో నెలకొంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రోజుకు ఒక గుడ్డు తీసుకుంటే సరిపోతుంది. డయాబెటిక్ రోగులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినొద్దు. కోడి గుడ్లు ఉడకబెట్టడానికి కూడా 12 నుంచి 15 నిమిషాలు మరిగించాల్సి ఉంటుంది. తక్కువ సేపు ఉడకబెడితే పచ్చ& తెల్ల సొన పూర్తిగా బాయిల్ అవ్వదు.
Sorry, no posts matched your criteria.