News November 10, 2024

US: కమలకు OpenAI ప్రచారం చేసిందా?

image

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు OpenAI ప్రచారం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ట్రంప్‌కు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే ‘అందుకు నేను సహకరించలేను’ అని బదులిచ్చింది. అదే ‘కమలకు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే మాత్రం ఆమెను గెలిపించాలని పలు కారణాలు చెప్పింది. దీంతో OpenAIపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది.

News November 10, 2024

BGT: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

image

నవంబర్ 22 నుంచి ఇండియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా 13 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. కాగా భారత్ ఇప్పటికే 18 మందితో జట్టును ప్రకటించింది.

News November 10, 2024

US: వైట్‌హౌస్ గురించి ఇవి తెలుసా?

image

అమెరికా అధ్యక్ష అధికారిక భవనం వైట్‌హౌస్‌ను ప్రెసిడెంట్స్ ప్యాలెస్ లేదా ప్రెసిడెంట్స్ హౌస్ అని పిలిచేవారు. 1901 వరకు వైట్‌హౌస్ అనేది ముద్దు పేరుగా ఉండేది. అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్డ్ ఆ పేరును అధికారిక పేరుగా ప్రకటించారు. ఇందులో 32 గదులు, 35 బాత్రూంలు, వినోదానికి సినిమా హాల్, టెన్నిస్ కోర్ట్, బౌలింగ్ అల్లే ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, న్యూక్లియర్ బంకర్, నోఫ్లైజోన్‌ ఉన్నాయి.

News November 10, 2024

పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా

image

ఒడిశాలోని బెర్హంపూర్ పోలీసులు ట్వీట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తండ్రీ కొడుకులపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి ఫొటోను Xలో పంచుకున్నారు. కాగా వారికి మొహాలకు విచారకరమైన ఎమోజీలను జోడించారు. ఈ పోస్టులో పోలీసులు చూపించిన క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బెర్హంపూర్ PS అకౌంట్ పరిశీలించగా వారు ఎప్పటి నుంచో ఇలాంటి పోస్టులు చేస్తున్నట్లు తెలిసింది.

News November 10, 2024

టీచర్లను సన్మానించనున్న ప్రభుత్వం

image

AP: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను సన్మానించనుంది. వరదల కారణంగా వాయిదాపడ్డ టీచర్స్ డే వేడుకలను కూడా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా 174 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించనుంది. వారికి బెస్ట్ టీచర్ అవార్డులు ఇవ్వనుంది.

News November 10, 2024

రైతులకు డ్రోన్లు అందిస్తాం: అచ్చెన్నాయుడు

image

AP: ఆసక్తి ఉన్న రైతులకు డ్రోన్లు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 40వేల డ్రోన్లు అవసరం ఉందని ఆయన చెప్పారు. దీంతో పాటు ఎరువులను ద్రవరూపంలోకి మార్చాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఉద్యానవన పంటలతో రైతులకు లాభమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని, దానికి పూర్వవైభవం తీసుకొస్తామని కిసాన్ మేళాలో చెప్పారు.

News November 10, 2024

500 ఏళ్ల నుంచి అద్దెలే పెంచని గ్రామం!

image

ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే దాదాపు 500 ఏళ్ల నుంచి జర్మనీలోని ఫుగ్గేరీ గ్రామంలో అద్దెలే పెంచలేదు. ప్రస్తుతం అక్కడ ఏడాది అద్దె ఒక డాలర్ మాత్రమే. ఆ ప్రాంతానికి చెందిన ధనిక వ్యాపారవేత్త జాకబ్ ఫుగ్గర్ పేదల(కాథలిక్ విశ్వాసులకు మాత్రమే) కోసం 1521లో దీనిని కట్టించాడు. 67 ఇళ్లు, 142 అపార్ట్‌మెంట్లు ఉండగా 150 మంది జీవిస్తున్నారు. నివాసితులు రా.10 గం. కల్లా ఇంటికి చేరుకోవాలనే రూల్ ఉంది.

News November 10, 2024

నవంబర్ 10: చరిత్రలో ఈరోజు

image

* 1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం.
* 1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం.(ఫొటోలో)
* 1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం.
* 1957: గాయనీ, సంగీత దర్శకురాలు, రచయిత శోభారాజు జననం.
* ప్రపంచ సైన్స్ దినోత్సవం.

News November 10, 2024

పాకిస్థాన్‌కు వెళ్లేది లేదన్న బీసీసీఐ!

image

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆ దేశానికి వెళ్లబోదని BCCI ఐసీసీకి చెప్పినట్లు తెలుస్తోంది. 8ఏళ్ల విరామం తర్వాత జరుగుతోన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను ఈసారి పాకిస్థాన్ దక్కించుకుంది. కాగా ఆ దేశంతో సత్సంబంధాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా భారత్ ఆ దేశానికి వెళ్లడం లేదు. ఇప్పుడు భారత్ వెళ్లని పక్షంలో తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రతిపాదనలున్నాయి.

News November 10, 2024

విగ్రహాలను కాపాడేందుకు క్యూఆర్ కోడ్: తమిళనాడు

image

విలువైన విగ్రహాలు చోరీ కాకుండా చూసేందుకు వాటికి QR కోడ్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. విగ్రహాలు చోరీ అయితే ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు కోడ్‌ను వాడుకోవచ్చని మంత్రి శేఖర్ బాబు వివరించారు. ‘కోడ్‌ల ద్వారా ఇకపై విగ్రహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. మరో 6 నెలల్లో ఈ మొత్తం ప్రాసెస్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు రికవర్ చేసిన విగ్రహాలను వాటి స్థానంలో తిరిగి ప్రతిష్టిస్తాం’ అని పేర్కొన్నారు.