India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పౌరాణిక ఇతిహాసం ‘మహాభారతం’ సినిమాను రాజమౌళి తెరకెక్కించనున్న నేపథ్యంలో దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను నాస్తికుడనని తెలిపారు. ‘మగధీర’ సినిమా తెరకెక్కించే సమయంలో కారు ప్రమాదం జరిగినపుడు రాజమౌళి భార్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పుడు కూడా దేవుడిని ప్రార్థించకుండా భార్యను కాపాడుకునేందుకు 60kms దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లానన్నారు. పనే తన దేవుడన్నారు.
రెజ్లర్ వినేశ్ ఫొగట్ <<13802900>>రిటైర్మెంట్<<>> నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆమె చిన్ననాటి కోచ్ మహావీర్ ఫొగట్ సూచించారు. ‘మెడల్‌కు చేరువగా వచ్చి కోల్పోవడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్ తిరిగొచ్చాక ఆమెతో మాట్లాడి మనసు మార్చుకునేలా వివరిస్తా. తీవ్రంగా శ్రమిస్తే విజయం కష్టమేమీ కాదు’ అని తెలిపారు. ఈయన జీవితం ఆధారంగా దంగల్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఇవాళ జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి. శోభిత ఏపీలోని తెనాలిలో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా ముంబైకి షిఫ్ట్ అయ్యారు. భరతనాట్యం, కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకున్నారు. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఫెమినా మిస్ ఇండియా-2013 టైటిల్ గెలుచుకున్నారు. గూఢచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్‌తో పాటు మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలోనూ నటించారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో సమావేశం కానున్నారు. కర్ణాటకలోని ఆరు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మంత్రిని పవన్ కోరనున్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా ఏపీలోని చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఏనుగుల గుంపును తరమడానికి కుంకీ ఏనుగులు అవసరం.
ఓ బాలుడు తన గర్ల్ ఫ్రెండ్‌కు ఐఫోన్ కొనిచ్చేందుకు తన తల్లి బంగారాన్నే దొంగతనం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో జరిగింది. ఓ పాఠశాలలో 9వ తరగతి చదివే అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఐఫోన్ కొనిద్దామనుకున్నాడు. డబ్బులు లేక అతడి తల్లి నగలనే దొంగిలించి, విక్రయించగా వచ్చిన రూ.50 వేలతో ఐఫోన్ కొనిచ్చాడు. నగలు చోరీ అయ్యాయని తల్లి ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.
అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై మహావికాస్ అఘాడీ కూటమి దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల్లో కూటమిలోని కాంగ్రెస్ 13 సీట్లు గెలిచి పెద్దపార్టీగా నిలవడంతో ఈసారి సీఎం పదవిపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈసారి తమకే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ ఎస్పీ పోటీపడుతున్నాయి.
ఈ సారి సీఎం పదవి కాంగ్రెస్‌కే ఇవ్వాలని పీసీసీ చీఫ్ నానా పటేల్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేలతో భేటీ అయ్యారు. గతంలో కూటమి తరఫున సీఎంగా ఉన్న తనకే అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ‘నేను మంచి చేసినట్టు నా సహచరులు భావిస్తే, నేను కావాలో వద్దో వారినే (INC-NCPSP) అడగండి’ అని ఉద్ధవ్ మీడియాతో అనడం గమనార్హం.
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని యశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకట్ కె.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, హ్యూమా ఖురేషీ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు సమాచారం.
దేశంలో అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క ఏడాదిలో (2023-24) ఏకంగా 42వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు పెరగకుండా ఉండేందుకు రిటైల్ రంగంలో నియామకాలను సైతం తగ్గించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య 3,89,000 నుంచి FY24లో 3,47,000కు చేరింది. కొందరు రిజైన్ చేస్తే మరికొందరిని కంపెనీ తొలగించింది.
సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 34 ఏళ్ల సీపీఎం పాలనలో ఈయన చివరి సీఎం. 2000 నుంచి 2011 వరకు కంటిన్యూగా 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.
Sorry, no posts matched your criteria.