News August 8, 2024

ఎమ్మెల్సీ బై ఎలక్షన్.. వైసీపీ క్యాంపు రాజకీయం?

image

AP: విశాఖ స్థానిక సంస్థల <<13788692>>ఎమ్మెల్సీ<<>> ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ నేరుగా MPTC, ZPTCలతో మాట్లాడుతున్నారు. నిన్న అరకు, పాడేరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఇవాళ పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి నేతలతో భేటీ అనంతరం వారిని కూడా క్యాంపునకు తరలిస్తారని తెలుస్తోంది.

News August 8, 2024

నేడు స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలను పాఠశాలల్లో ప్రదర్శించారు. ఎన్నిక విధానం చేతులు ఎత్తడం లేదా చెప్పడం ద్వారా ఉంటుంది. ఎన్నికైన మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇవాళే ప్రమాణస్వీకారం చేసి తొలి కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులనూ నియమిస్తారు.

News August 8, 2024

యువ ప్లేయర్లతో సిరీస్ గెలిచేసింది!

image

యువ సంచలనాలతో శ్రీలంక అదరగొట్టింది. పతిరణ, హసరంగ, మధుశంక, తుషార, చమీరా, ఫెర్నాండో వంటి సీనియర్ ప్లేయర్లు లేకున్నా బలమైన టీమ్ ఇండియాపై విజయం సాధించింది. తమ బలమైన స్పిన్ విభాగంతో రోహిత్ సేనను కట్టడి చేసింది. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ వెల్లలగే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు.

News August 8, 2024

అర్ధరాత్రి భారీ వర్షం

image

TG: అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్, టోలిచౌకి ఏరియాల్లో వాన దంచికొట్టింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అటు భద్రాచలం సైతం నీటమునిగింది.

News August 8, 2024

వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి?

image

ఇస్లాం మతాచారాలు పాటించేవారు తమకున్న స్థిర, చరాస్తులను దానం చేస్తే, ఆ ఆస్తులను వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులన్నింటినీ నిర్వహించేదే వక్ఫ్ బోర్డు. దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాక్ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. దేశంలోని 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు. మిలిటరీ, రైల్వే తర్వాత అత్యధికంగా భూములు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డులే.

News August 8, 2024

నేడు లోక్‌సభలో వక్ఫ్ బిల్లు

image

‘ద వక్ఫ్ బిల్లు’ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులు చేసింది. బోర్డు పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లిమేతరులకు కూడా చోటు కల్పించాలని భావిస్తోంది. దాదాపు 44 సవరణలతో రూపొందించిన ఈ బిల్లును ఇప్పటికే లోక్‌సభ సభ్యులకు అందజేసింది. దీనిపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

News August 8, 2024

విద్యార్థులకు ALERT.. నేడు, రేపే ఛాన్స్

image

TG: డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ తుది దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఫైనల్ ఫేజ్‌లో 44,683 మందికి సీట్లు అలాట్ చేసినట్లు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ, రేపు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని సీటును రిజర్వ్ చేసుకోవాలని సూచించారు.

News August 8, 2024

53 నుంచి 50 కేజీల విభాగంలోకి మారడం వల్లే..: అదిల్

image

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ విషయంలో ఎలాంటి కుట్ర జరగలేదని భారత అథ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్ సుమరీవాలా అభిప్రాయపడ్డారు. ‘వినేశ్ ఎప్పుడూ 53 కేజీల విభాగంలో పోటీ పడేవారు. తాజాగా 50 కేజీల విభాగంలోకి మారారు. దీంతో ఈ సమస్య వచ్చింది. అధిక బరువు విషయంలో ఎలాంటి సడలింపు లేదు. రూల్ రూలే’ అని స్పష్టం చేశారు. కాగా, తొలి పోటీకి ముందు 49.900 కేజీల బరువు ఉన్న ఫొగట్.. సెమీస్ ముగిశాక 52.800 గ్రా.కు చేరారు.

News August 8, 2024

BREAKING: వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం

image

భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. నాకు ఇంక బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా అధిక బరువు కారణంగా ఫొగట్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. దీంతో చివరి క్షణంలో ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయారు.

News August 8, 2024

ఫిబ్రవరిలో తిరిగి రానున్న సునీతా విలియమ్స్!

image

అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. ఒకవేళ బోయింగ్ స్టార్ లైనర్ సురక్షితం కాదని భావిస్తే స్పేస్ఎక్స్‌ క్రూ డ్రాగన్ ద్వారా తీసుకొస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన స్పేస్ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కాగా జూన్ 5న సునీత రోదసిలోకి వెళ్లగా స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్య తలెత్తడంతో ఆమె అక్కడే ఉండిపోయారు.