India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. నాకు ఇంక బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా అధిక బరువు కారణంగా ఫొగట్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. దీంతో చివరి క్షణంలో ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయారు.
అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు రానున్నట్లు నాసా తెలిపింది. ఒకవేళ బోయింగ్ స్టార్ లైనర్ సురక్షితం కాదని భావిస్తే స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తీసుకొస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన స్పేస్ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కాగా జూన్ 5న సునీత రోదసిలోకి వెళ్లగా స్పేస్ క్రాఫ్ట్‌లో సమస్య తలెత్తడంతో ఆమె అక్కడే ఉండిపోయారు.
నీట్-పీజీ ప్రశ్నాపత్రం లీకైందంటూ కొందరు చేస్తున్న <<13798948>>ప్రచారాన్ని<<>> నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆన్ మెడికల్ సైన్సెస్(NBEMS) కొట్టిపారేసింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రచారంలో ఉన్న తప్పుడు న్యూస్‌ను చూసి అభ్యర్థులు మోసపోవద్దని సూచించింది. ఇప్పటి వరకూ నీట్-పీజీ 2024 ప్రశ్నాపత్రం రూపొందించలేదని తెలిపింది. లీకు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేసింది.
AP: టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఇవాళ మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరగనుంది. అజెండాలో ఆరు అంశాలు పెట్టినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సంస్థాగత వ్యవహారాలు వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG: గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గ్రామపంచాయతీలకు రూ.10,170 కోట్లు కేటాయించి రూ.5,988 కోట్లనే రిలీజ్ చేసిందని మీడియాతో చెప్పారు. మిగిలినవి పెండింగ్‌లో పెట్టిందన్నారు. BRS ప్రభుత్వ తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంపై హరీశ్ రావు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
AP: గ్రూప్-1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ కీలక సూచన చేశారు. అభ్యర్థులు ఏ మీడియంలో పరీక్షలు రాయాలనుకుంటున్నారో, పోస్టులు, జోనల్, పరీక్షా కేంద్రాల ప్రాధాన్య వివరాలను ఈ నెల 16లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కాగా 81 పోస్టుల భర్తీకి మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
APSRTCకి త్వరలో వెయ్యి కొత్త బస్సులు రాబోతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో 14 బస్సులను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 400 బస్సులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని తెలిపారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘పోకిరి’ లాంటి సినిమా చేయాలని ఉందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ‘పోకిరి’ తనకు టెక్ట్స్ బుక్ వంటిదని చెప్పారు. ఇప్పటివరకూ మహేశ్‌కు స్టోరీ ఏమీ చెప్పలేదన్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్-రవితేజ కాంబినేషన్లో సినిమా తీయాలని ఉందని చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవని, తన స్టైల్ సినిమాలు చేస్తానని తెలిపారు.
ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ DELL సేల్స్ విభాగంలోని 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. AIపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో పాటు వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం కోల్పోయిన వారిలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ఉన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి ఈ విషయాన్ని మెమోలో తెలియజేసినట్లుగా పేర్కొంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనుకున్న భారత ప్లేయర్లు గెలుపు అంచులదాకా వెళ్లి ఆగిపోతున్నారు. ఈ సీజన్‌లో షూటింగ్‌లో మనూ భాకర్, అర్జున్, ఆర్చరీలో ధీరజ్-అంకిత ద్వయం, స్కీట్ షూటింగ్‌లో అనంత్ జీత్& మహేశ్వరి జోడీ, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం ఒక్క స్థానంతో పతకాన్ని కోల్పోవడం ఆటగాళ్లతో పాటు అభిమానులకు హార్ట్ బ్రేకింగ్‌గా మారింది.
Sorry, no posts matched your criteria.