News January 27, 2025

సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లకు ₹25 కోట్లు

image

12 ఏళ్లకోసారి జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ₹25 కోట్లు మంజూరు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15-26 వరకు జ‌ర‌గ‌నున్న పుష్క‌రాల్లో మౌలిక వసతులు, స్నాన ఘట్టాలు, డ్రైనేజీల నిర్మాణం, రోడ్ల విస్తరణ సహా తదితర పనులను చేప‌ట్ట‌నున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

News January 27, 2025

రంజీ జట్టు ప్రకటించిన ఢిల్లీ.. కోహ్లీకి చోటు

image

రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌తో ఆడే మ్యాచ్‌కు ఢిల్లీ జట్టును ప్రకటించింది. భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఎంపిక కాగా, పంత్‌కు చోటు దక్కలేదు. 13ఏళ్ల తర్వాత విరాట్ రంజీ ఆడనున్నారు. JAN 30నుంచి మ్యాచ్ జరగనుంది.
జట్టు: బదోని, కోహ్లీ, ప్రణవ్, సాంగ్వాన్, అర్పిత్, మయాంక్, శివమ్, సుమిత్, వాన్ష్, మనీ, హర్ష్ త్యాగి, సిద్ధాంత్, సైనీ, యశ్ ధుల్, గగన్, జాంటీ సిద్ధు, హిమ్మత్, వైభవ్, ఆర్. గెహ్లోత్, జితేశ్ సింగ్.

News January 27, 2025

7 నెలల్లోనే ఏపీకి రూ.3లక్షల కోట్లు: పెమ్మసాని

image

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారుల్లో సానుకూల దృక్పథం ఏర్పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. 7 నెలల్లోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. మొత్తం 49 కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. అందులో TCS, HCL, రిలయన్స్, శ్రీసిటీ ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు.

News January 27, 2025

రష్మిక సినిమాపై వివాదం.. సీఎం ఏమన్నారంటే?

image

విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమాపై <<15278801>>వివాదం నేపథ్యంలో<<>> మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. ఛత్రపతి శివాజీ చరిత్రను కరెక్ట్‌గా చూపించాలని, దాన్ని వక్రీకరించడం సరికాదని స్పష్టం చేశారు. శంభాజీపై అందరికీ ఎంతో ప్రేమ, గౌరవం ఉందన్నారు. సినిమాల్లో క్రియేటివిటీ, సెన్సిటివిటీల మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు. కాగా మూవీలో వివాదాస్పదమైన డాన్స్ సీన్‌ను తొలగిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

News January 27, 2025

బుమ్రా కంటే ముందుగా వీరికే ICC అవార్డులు

image

భారత్ స్పీడ్‌గన్ జస్ప్రీత్ బుమ్రా ‘ICC టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లలో బుమ్రా కంటే ముందు కొందరు ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. వారిలో ద్రవిడ్, గంభీర్, సెహ్వాగ్, అశ్విన్, కోహ్లీ ఉన్నారు. BGTలో గాయపడిన బుమ్రాకు ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇచ్చారు. బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించేందుకు CTకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

News January 27, 2025

VSR పిటిషన్‌పై విచారణ వాయిదా

image

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు ఆయన సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. దానిపై వాదనలు పూర్తి కాగా, పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగిన VSR రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News January 27, 2025

పథకాలకు డబ్బుల్లేవన్న చంద్రబాబు.. మీరేమంటారు?

image

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, పథకాల అమలుకు డబ్బులు లేవన్న CM <<15282237>>CBN వ్యాఖ్యలపై<<>> భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి తెలియదా? అని YCP శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుని ఇలాంటి మాటలేంటని నిలదీస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారని, ఇందులో విమర్శలకు తావులేదని TDP శ్రేణులు కౌంటరిస్తున్నాయి.

News January 27, 2025

OTTలోకి వచ్చేస్తున్న ‘పుష్ప-2’

image

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ‘పుష్ప-2’ OTTలోకి వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నెట్‌ఫ్లిక్స్ ‘COMING SOON’ అని ప్రకటించింది. రీలోడెడ్ వెర్షన్(3గం.44ని) అందుబాటులోకి రానుంది. గతేడాది DEC 5న రిలీజైన మూవీ దాదాపు రూ.1900cr రాబట్టింది. 56డేస్ తర్వాత OTTలోకి వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా, JAN 30న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

News January 27, 2025

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధికి ఊరట

image

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డెంగ్యూ, మలేరియా వంటి సనాతన ధర్మాన్ని తరిమికొట్టాలని 2023లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే దీనిపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

News January 27, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ ఆ హీరోతో చేస్తా: అనిల్ రావిపూడి

image

వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సక్సెస్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఒకవేళ తనకు అవకాశం వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ సల్మాన్ ఖాన్‌తో చేస్తానని చెప్పారు. ఈ కథ ఆయనకు బాగా సూట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.