News April 16, 2025

గర్ల్‌ఫ్రెండ్ ఉందన్నందుకు యూఎస్ వీసా రిజెక్ట్

image

ఢిల్లీకి చెందిన ఓ యువకుడి నిజాయితీ అతడికి US వీసా రాకుండా చేసింది. ఇంటర్వ్యూ కోసం అతడు ఎంబసీకి వెళ్లగా ‘మీకు USలో ఫ్యామిలీ/ఫ్రెండ్స్ ఉన్నారా’ అని ఆఫీసర్ ప్రశ్నించారు. ‘అవును, ఫ్లోరిడాలో నా గర్ల్‌ఫ్రెండ్ ఉంది. తనను కలవాలని ప్లాన్ చేసుకున్నా’ అని అతడు సమాధానమిచ్చాడు. అంతే మరో ప్రశ్న లేకుండా వీసా రిజెక్షన్ స్లిప్ చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడు రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా చర్చనీయాంశమైంది.

News April 16, 2025

బెడ్‌ మీద ఇలా చేయకండి!

image

మనలో చాలామంది తడి టవల్స్ బెడ్ మీదే వేస్తుంటాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వాటిలోని తడి కారణంగా పరుపు, దుప్పట్లలో క్రిములు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడివే కాక విడిచిన దుస్తులు సైతం మన శరీరం నుంచి సూక్ష్మక్రిముల్ని బెడ్‌పైకి మోసుకెళ్తాయంటున్నారు. బయట తిరిగొచ్చి కాళ్లు కడగకుండా మంచంపైకి చేరడమూ అనారోగ్యాలకు కారణమవుతాయని వివరిస్తున్నారు.

News April 16, 2025

యూఎస్ ఉపాధ్యక్షుడి భారత పర్యటన ఖరారు

image

యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో కుటుంబ సమేతంగా పర్యటిస్తారని వైట్ హౌజ్ ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలతో ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై ఆయన చర్చించనున్నారు. భారత్‌లో న్యూఢిల్లీ, జైపుర్, ఆగ్రా సందర్శిస్తారని పేర్కొంది. ఆయా నగరాల్లో పలు కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్ భారత సంతతి మహిళ.

News April 16, 2025

కాంగ్రెస్ కుంభకోణాల్ని ప్రజలు మర్చిపోలేదు: కిషన్ రెడ్డి

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ చేర్చిన అంశంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. ధర్నాలు చేసినంత మాత్రాన వారి అవినీతి, అక్రమాలు సమసిపోవు. ప్రజలింకా బోఫోర్స్, బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, హెలికాప్టర్ల కుంభకోణాల్ని మర్చిపోలేదు. ఈ కేసు విచారణ జరగాలని కోర్టులు తేల్చి చెప్పాయి’ అని పేర్కొన్నారు.

News April 16, 2025

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా జయసుధ

image

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీకి నటి జయసుధ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జ్యూరీ తాజాగా FDCలో సమావేశమైంది. అవార్డుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను TFDC ఛైర్మన్ దిల్ రాజు కోరారు. అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్స్ రాగా ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు స్క్రీనింగ్ చేయనున్నారు. నిష్పక్షపాతంగా ప్రక్రియను హ్యాండిల్ చేస్తామని జయసుధ పేర్కొన్నారు.

News April 16, 2025

వైఎస్ జగన్‌కు టీడీపీ సవాల్

image

AP: టీటీడీ గోశాలలో గోవులు పెద్దఎత్తున మరణించాయనే ప్రచారంపై TDP ఘాటుగా స్పందించింది. వైసీపీ చీఫ్ జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రేపు తిరుమలకు రావాలని Xలో ఛాలెంజ్ చేసింది. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కళ్లారా చూడాలంది. రేపు ఉ.10 గంటలకు లైవ్ ఇస్తామని పేర్కొంది.

News April 16, 2025

NEET-PG నోటిఫికేషన్ విడుదల

image

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG <>దరఖాస్తులు<<>> రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వీకరించనున్నట్లు NBEMS ప్రకటించింది. అప్లికేషన్లకు చివరి తేదీ మే 7 రాత్రి 11.55 గంటలుగా పేర్కొంది. నీట్-పీజీ ఎగ్జామ్ జూన్ 15న CBT విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించనుంది. జులై 15న ఫలితాలు విడుదల చేయనుంది.

News April 16, 2025

పీఎం ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీం దరఖాస్తుల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈనెల 22 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఈ స్కీంలో భాగంగా నిరుద్యోగ యువతకు దేశంలోని 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తుంది. ఏడాది పాటు నెలకు రూ.5 వేల చొప్పున డైరెక్ట్‌గా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. https://pminternship.mca.gov.in/login/ సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. 21-24 ఏళ్లవారు అర్హులు.

News April 16, 2025

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

image

IPLలో భాగంగా ఈరోజు ఢిల్లీలో DCతో RR తలపడుతోంది. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5 మ్యాచులాడి ఒకటే ఓడిన DC రెండో స్థానంలో ఉండగా 6 మ్యాచుల్లో 2 గెలిచిన RR 8వ స్థానంలో ఉంది.
DC: జేక్, పోరెల్, కరుణ్, రాహుల్, స్టబ్స్, అశుతోశ్, అక్షర్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, మోహిత్
RR: సంజూ, యశస్వీ, రాణా, పరాగ్, జురెల్, హెట్మెయిర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్

News April 16, 2025

మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

image

భారత్‌లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.

error: Content is protected !!