News September 28, 2024

రెండో రోజు ప్రారంభం కాని ఆట!

image

కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. కాన్పూర్‌లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. కాగా నిన్న కూడా వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.

News September 28, 2024

ALERT: ముంబైకి టెర్రర్ థ్రెట్

image

టెర్రర్ థ్రెట్ ఉందన్న సెంట్రల్ ఏజెన్సీల సమాచారంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో క్రౌడెడ్ ప్లేసెస్, టెంపుల్స్ వద్ద సెక్యూరిటీని పెంచారు. ఆ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ చేయాల్సిందిగా వారికి ఆదేశాలు అందినట్టు తెలిసింది. తమ పరిధిలోని ప్రాంతాల్లో సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని DCPలను ఆదేశించారు. టెంపుల్స్ వద్ద అలర్టుగా ఉండాలని, ఎలాంటి సస్పీసియ్ యాక్టివిటీ అనిపించినా వెంటనే చెప్పాలని సూచించారు.

News September 28, 2024

జానీ మాస్టర్‌ కేసులో బిగ్ ట్విస్ట్

image

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన భార్య అయేషా ఫిర్యాదు చేశారు. ‘నా భర్తను ఆమె ప్రేమ, పెళ్లి పేరుతో వేధించింది. నేను ఆత్మహత్యకు యత్నించేవరకు తీసుకెళ్లింది. బాధితురాలి తల్లి కూడా వేధించింది. నాకు, పిల్లలకు ఏమైనా అయితే వారిదే బాధ్యత. నాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జానీ మాస్టర్ 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది.

News September 28, 2024

గ్రూప్-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్

image

TG: గ్రూప్-1 నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చెల్లదంటూ పిటిషనర్ పేర్కొన్నారు. అయితే TGPSC రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

News September 28, 2024

బాలయ్యకు ఐఫా పురస్కారం

image

నటసింహం నందమూరి బాలకృష్ణకు ఐఫా-2024 వేడుకల్లో అరుదైన పురస్కారం దక్కింది. నిన్న జరిగిన కార్యక్రమంలో ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు ఇచ్చే ముందు బాలకృష్ణ పాదాలకు కరణ్ నమస్కరించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, వెంకటేశ్ సైతం హాజరయ్యారు.

News September 28, 2024

పట్టు వస్త్రాల సమర్పణపై కీలక ఆదేశాలు

image

AP: ఆలయాల్లో రాష్ట్ర స్థాయి పండుగలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణపై దేవదాయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో సీనియర్ మంత్రి లేదా దేవదాయ శాఖ మంత్రి లేదా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలి.

News September 28, 2024

‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’గా సమంత

image

స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఐఫా-2024 వేడుకల్లో ఆమె ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. విక్కీ కౌశల్ చేతుల మీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. కాగా ఈవెంట్లో తన వస్త్రధారణతో సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

News September 28, 2024

GST on PETROL: హైకోర్టు సూచించినా కనీసం చర్చకు ఒప్పుకోని కేరళ CM, FM

image

లిక్కర్, పెట్రోల్ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులు కాబట్టే GSTలోకి తీసుకొచ్చేందుకు అంగీకరించడం లేదని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ అన్నారు. ‘పెట్రోల్‌ను GSTలో చేర్చేందుకు కౌన్సిల్లో చర్చించాలని నిరుడు కేరళ హైకోర్టు సూచించింది. అందుకు కేరళ CM, FM అంగీకరించనే లేదు. GSTలో దేనికైనా ఏకగ్రీవం తప్పనిసరి. సీఎంలూ ఒప్పుకోవాలి. అందుకే నాన్ బీజేపీ స్టేట్స్ కనీసం వ్యాట్ కూడా తగ్గించడం లేదు’ అని తెలిపారు.

News September 28, 2024

హర్షసాయి దేశం వదిలి వెళ్లకుండా చూడండి: బాధితురాలు

image

యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అతడు దేశం వదిలి వెళ్లకుండా చూడాలని బాధితురాలు సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసు జారీచేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీపీని కోరారు.

News September 28, 2024

PPF, SSY, పోస్టాఫీస్ స్కీమ్స్ వడ్డీరేట్లు తగ్గిస్తారా?

image

PPF, SSY, SCSS వంటి స్కీముల వడ్డీరేట్లను కేంద్రం 3 నెలలకోసారి రివ్యూ చేస్తుంది. పదేళ్ల G-Sec యీల్డుల కన్నా కనీసం 25BPS ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఇన్‌ఫ్లేషన్ తగ్గడంతో RBI రెపోరేట్ల కోత చేపట్టొచ్చని అంచనా. అప్పుడు G-Sec యీల్డులూ తగ్గుతాయి. దాంతో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ తగ్గిస్తారని విశ్లేషకుల అంచనా. అక్టోబర్లోనే రివ్యూ ఉంటుంది. మరి కేంద్రం వడ్డీని తగ్గిస్తుందో, పెంచుతుందో చూడాలి. మీ కామెంట్.