India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వక్ఫ్ సవరణ బిల్లుపై JPCలో విపక్షాల ప్రతిపాదనలను తిరస్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. NDA సభ్యుల 14 ప్రతిపాదనలను ఆమోదించి, 44 క్లాజుల్లో తాము ప్రతిపాదించిన వందలాది సవరణలను అజెండా ప్రకారం పక్కనపెట్టేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమిటీ ఛైర్మన్ పాల్ ప్రజాస్వామ్యానికి బ్లాక్‌లిస్టర్ అని మండిపడుతున్నాయి. అంతా ఏకపక్షమైనప్పుడు JPC ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.

AP: లోకేశ్ చేపట్టిన యువగళం ఎంతోమందికి ప్రేరణగా నిలిచిందని తేజశ్రీ అనే ఆర్టిస్ట్ నవ ధాన్యాలతో ఆయన చిత్రాన్ని వేశారు. ఆ యాత్ర చేపట్టి రెండేళ్లు పూర్తైన సందర్భంగా 6*4 అడుగుల చిత్రాన్ని 3 రోజుల్లో పూర్తి చేయడం గర్వంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. అద్భుతమైన కళాఖండం రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీని తయారీకి ఆమె చేసిన కృషి, చూపిన నిబద్ధతను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

AP: జనసేనలో చేరేవారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.

TG: VCల నియామకంపై UGC జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. ఈ గైడ్‌లైన్స్ వల్ల వీసీల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్తుందన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్‌ను నియమించాలనుకోవడం సరికాదని, ఇవి ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

TG: రైతుభరోసా డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు. ఇవాళ 4,41,911 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు.

ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఒకటో తేదీన వచ్చిన జీతం 10రోజులకే ఖాళీ అవుతుంది. అందుకే ‘ఫస్ట్ వీక్ రూల్’ను పాటించాలి. అంటే మీ ఆదాయంలోని 20% మొత్తాన్ని సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మొదటి వారమే పెట్టేయాలి. అధిక వడ్డీలతో అప్పులు చేయొద్దు. ఆదాయస్థాయి కంటే తక్కువలోనే ఖర్చు చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటుచేసుకోవాలి. బేరం ఆడటం, పన్నులను మేనేజ్ చేయడం నేర్చుకోండి. కొత్త ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవాలి.

AP: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా 2025 జులైకు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పురుషోత్తపట్నం మీదుగా ఉత్తరాంధ్రకు నీరు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణ పనులను వైఎస్ జగన్ పూర్తిగా నిలిపేస్తే చంద్రబాబు ఊపిరి పోశారని చెప్పారు. గతంలో రైతులు కన్నీళ్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వం కనికరం చూపలేదని దుయ్యబట్టారు.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ఓ మహిళ అరెస్టైంది. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ వాడిన సిమ్ ఈ మహిళ పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ముంబై తీసుకెళ్లి విచారించేందుకు ఆ రాష్ట్ర పోలీసుల అనుమతి తీసుకోనున్నారు. సైఫ్‌పై తన ఇంట్లోనే ఈ నెల 16న దాడి జరిగిన విషయం తెలిసిందే.

మనిషి సహా ఉపరితల జీవుల చెవులు చేపల మొప్పల నుంచి అభివృద్ధి చెందాయని అమెరికా పరిశోధకులు తేల్చారు. ‘మన చెవుల్లో ఉండే జన్యువుల్ని జీబ్రాఫిష్ జినోమ్‌లోకి ప్రవేశపెడితే ఆ చేప మొప్పల్లో మార్పు కనిపించింది. ఇక జీబ్రా ఫిష్ నుంచి జన్యువుల్ని చిట్టెలుకల్లో ప్రయోగించగా వాటి చెవుల్లో మార్పులు కనిపించాయి. పరిణామక్రమంలో చేపల మొప్పలే భూమ్మీద జీవులకు చెవులయ్యాయనేది మా అధ్యయనంలో తేలింది’ అని పేర్కొన్నారు.

నానాటికీ పెరుగుతున్న<<15262482>>murder<<>>, అత్యాచారాలు, ఘోరాల వెనుక OTT సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రధాన కారణమవుతున్నాయా? గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల బట్టి ఇవే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్‌పై నియంత్రణ లేదు. దీంతో హింసాత్మక, జుగుప్సాకరమైన కంటెంట్ సులువుగా నెట్టింట లభిస్తోంది. బలహీన మనస్కులపై అది ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.