India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం ఇవాళ వైసీపీకి <<13795898>>రాజీనామా<<>> చేసిన విషయం తెలిసిందే.
రూపే క్రెడిట్ కార్డులకు సైతం సాధారణ క్రెడిట్ కార్డులతో సమానంగా రివార్డు పాయింట్లు ఇవ్వాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ బ్యాంకులను ఆదేశించింది. SEP 1 నుంచి తమ ఆదేశాలు పాటించాలంది. క్రెడిట్ కార్డులతో UPI పేమెంట్స్ చేసేందుకు బ్యాంకులు రూపే కార్డులను అందిస్తున్నాయి. అయితే వీటిపై ఇస్తున్న రివార్డులు ఇతర కార్డుల కంటే తక్కువ. దీంతో కార్డుల వినియోగం పెంచేందుకు ఈ అంతరాన్ని తొలగించాలని NPCI ఆదేశాలిచ్చింది.
ఇప్పటికే నీట్-యూజీ అవకతవకలపై దేశవ్యాప్త చర్చ నడుస్తుండగా, తాజాగా నీట్-పీజీ పేపర్ కూడా లీక్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న జరిగే పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను టెలిగ్రామ్‌లో ‘నీట్ పీజీ లీక్డ్ మెటీరియల్స్’ పేరిట ఉన్న గ్రూపుల్లో విక్రయిస్తున్నారని ధ్రువ్ చౌహాన్ అనే నెటిజన్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు. దీంతో అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
AP:అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. TG, తమిళనాడు, కర్ణాటక నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా APలోకి రావడంతో ఖజానాకు రూ.18వేల కోట్లు నష్టం వచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ‘నాణ్యత లేని మద్యం అమ్మకాలతో గత ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడింది. వారి వ్యసనాన్ని ఆసరాగా తీసుకుంది. ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడతాం’ అని చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50కిలోల విభాగం ఫైనల్లో వినేశ్ స్థానంలో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్ బరిలోకి దిగనున్నారు. ఆమెను వినేశ్ సెమీస్‌లో 5-0 తేడాతో చిత్తుగా ఓడించారు. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందు వినేశ్‌పై IOC అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హులుగా ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి, పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారు పోటీ చేయవచ్చని మంత్రి పార్థసారథి తెలిపారు. వారిపై ఎలాంటి అనర్హత వేటు ఉండదన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ చట్టం అమల్లోకి తెచ్చినట్లు అభిప్రాయపడ్డారు.
AP: సర్వేరాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ ఫొటోతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పాస్ బుక్‌లు పంపిణీ చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ అట్టుడుకుతుండటంతో అక్కడి రాయబార కార్యాలయాల సిబ్బందిని భారత్ ఖాళీ చేయించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వల్ప సంఖ్యలో అధికారులు మాత్రం భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించాయి. వీరిలో ఢాకాలోని భారత హైకమిషనర్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. బంగ్లాలోని చిట్టగాంగ్, రాజ్‌షాహీ, ఖుల్నా, సిల్హెట్ వంటి నగరాల్లో భారత రాయబార కార్యాలయాలున్నాయి.
AP: విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికపై YCP అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘TDPకి సంఖ్యాబలం లేదు. నైతిక విలువలు పాటిస్తే ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. నేను CMగా ఉంటే పోటీ పెట్టేవాడిని కాదు. YCPకి 380పైచిలుకు మెజార్టీ ఉన్నా డబ్బుతో రాజకీయాలను CBN దిగజారుస్తున్నాడు. బొత్సను గెలిపించి CMకు గుణపాఠం చెప్పాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.
వచ్చే ఏడాది తాను పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నటి ప్రియా భవానీ శంకర్ తెలిపారు. ‘రాజ్‌తో పదేళ్లుగా రిలేషన్లో ఉన్నా. వివాహం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ సమయం దొరకక కుదరటం లేదు. వచ్చే ఏడాది తప్పకుండా ఏడడుగులు నడుస్తాం’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా నాగచైతన్య సరసన ‘ధూత’ వెబ్‌సిరీస్‌లో ప్రియా నటించారు. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు2’ లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.
Sorry, no posts matched your criteria.