India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యూపీ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 1.74 కోట్ల మందికిపైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు త్రివేణీ సంగమంలో స్నానమాచరించిన వారి సంఖ్య 13.21 కోట్లు దాటింది. ఈ నెల 29న మౌని అమవాస్య రోజున భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముందుగా ఛత్తీస్‌గఢ్‌లో <<15190207>>ఆకాశ్ కనోజియా<<>> అనే అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత అసలు నిందితుడు కాదని తెలియడంతో విడిచిపెట్టారు. అయితే ఈ అరెస్టు తర్వాత తన జీవితం నాశనమైందని ఆకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు పెళ్లి సంబంధం చెడిపోయిందని తెలిపాడు. తన కుటుంబం కూడా అవమానాలు ఎదుర్కొందని వాపోయాడు.

నిద్రలో ఉన్నప్పుడు కొందరికి కండరాలు పట్టుకోవడం, తిమ్మిరి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని క్షణాల పాటు ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీనికి డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత వంటివి కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు నొప్పి ఉన్న చోట మసాజ్ లేదా వేడి కాపడం పెట్టాలని సూచిస్తున్నారు. నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయని అంటున్నారు.

పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను ఫిబ్రవరిలో కేంద్రం జమ చేసే అవకాశం ఉంది. జనవరి 31లోగా E-KYC చేయించుకున్న రైతులకే ఈ పథకం కింద రూ.2వేలు జమ అవుతాయి. pmkisan.gov.in సైట్‌లో సులభంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. సైట్ ఓపెన్ చేశాక కుడి వైపున ఉండే e-KYCపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే చాలు. e-KYC కోసం ఇక్కడ <

AP: NDA శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అనవసర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లవద్దని కోరారు. తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరూ ప్రతిస్పందనగా వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చవద్దని సూచించారు. తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని, భవిష్యత్తులోనూ చేయనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఆయా చోట్ల ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించనుంది. కరీంనగర్ కార్పొరేషన్ పదవీకాలం ఎల్లుండితో పూర్తి కానుంది. ఏ ప్రాంతానికి ఎవరు అధికారిగా ఉన్నారో ఇక్కడ <

TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఇతర నేతలు, అధికారులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ గ్రహీత డా.నాగేశ్వర్ రెడ్డి రాగా సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.

UPలోని నోయిడాకు చెందిన సరస్వతి భాటీ 10వ తరగతి ఫెయిలయ్యారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. ఆ వెంటనే ముగ్గురు పిల్లలకు తల్లయ్యారు. కానీ ఏదో సాధించాలన్న పట్టుదల. శానిటరీ న్యాప్కిన్స్ మార్కెట్లో ఎక్కువ ధర ఉంటుండటం, ఊళ్లో మహిళలు బట్ట న్యాప్కిన్లను వాడటం గుర్తించిన ఆమె, స్వయం సహాయక బృందం సభ్యులతో కలిసి ప్యాడ్స్ తయారీ ప్రారంభించారు. ఇప్పుడు నెలకు రూ.30వేల విలువైన ప్యాడ్స్‌ను అమ్ముతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

AP: సత్యసాయి(D) సికేపల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందని విషయంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు వార్డెన్, సంబంధిత ఉద్యోగులు మధ్యాహ్నం భోజనం వండలేదని తెలియడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే భోజనం సమకూర్చినట్లు ఫోన్ చేసిన సీఎంకు కలెక్టర్ వివరించారు. పూర్తిస్థాయిలో విచారించి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని CM ఆదేశించారు.

TG: కొత్త పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమేనని <<15268566>>KTRకు<<>> డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున లాంఛనంగా పథకాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. BRS హయాంలో నిధులు అందుబాటులో ఉన్నా పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పేదలను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలు తాము తీసుకుంటామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.