India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాజాగా TDPని ఇరుకున పెట్టేలా కేంద్రం అమరావతికి రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చి తెలివైన ఏపీ ప్రజలను ఫూల్స్ చేస్తోందని TMC ఎంపీ మహువా విమర్శించారు. ఈ అప్పుల భారం రాష్ట్ర ప్రజలపైనే పడుతుందన్నారు. ఎన్డీయే కీలక భాగస్వామిగా ఉన్న TDP కేంద్రం నుంచి గ్రాంట్స్‌కు బదులుగా అప్పులు తెస్తోందని YCP విమర్శిస్తోంది. అదే న్యారేటివ్‌ను ఇండియా కూటమి మిత్రపక్షాలు ఫాలో అవుతుండడం గమనార్హం.
భారత్‌లో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా బంగ్లాదేశ్ మాదిరి హింసాత్మక, ప్రభుత్వ-వ్యతిరేక నిరసనలు జరిగే అస్కారం ఉందని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ హెచ్చరించారు. కశ్మీర్లో, ఇక్కడ అంతా బాగానే ఉందనిపించవచ్చని, క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితులు దాగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. CAA-NRCకి వ్యతిరేకంగా షాహిన్ బాగ్‌లో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా (86), చైనా (59) పతకాల పండగ చేసుకుంటున్నాయి. రష్యా పోటీలో లేకపోవడంతో ఈ 2 దేశాలకు ఎదురే లేకుండా పోయింది. యుద్ధం కారణంగా IOC రష్యాపై బ్యాన్ విధించింది. దీంతో ఆ దేశం నుంచి 15 మంది మాత్రమే పారిస్ ఒలింపిక్స్‌లో తటస్థ జెండాతో పాల్గొన్నారు. అదే టోక్యో ఒలింపిక్స్‌లో 330 మంది పోటీపడ్డారు. ప్రస్తుతం రష్యా స్టార్ అథ్లెట్లు ఎవరూ లేకపోవడంతో ఈ రెండు దేశాలు పతకాల వేటలో ముందున్నాయి.
AP: జనసేనాని, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం (కాకినాడ జిల్లా) నియోజకవర్గంలో YCPకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన ఆయన 2019లో ఆ పార్టీ నుంచే పోటీ చేసి గెలిచారు. 2024లో పెండెంను కాకుండా వైసీపీ వంగా గీతను బరిలోకి దింపడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
బాల్డ్ ఈగల్‌ను తమ జాతీయ పక్షిగా ఆమోదిస్తూ అమెరికా సెనేట్ బిల్లు పాస్ చేసింది. మిన్నెసొటా సభ్యురాలు అమీ క్లొబుచార్ ఈ ప్రతిపాదన తీసుకురాగా సెనేట్ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించారు. చట్టసభలోనూ పాస్ అయితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. సుమారు 240 ఏళ్లుగా అమెరికాకు బాల్డ్ ఈగల్ సంకేతంగా ఉందని ఈ సందర్భంగా సెనేటర్లు గుర్తుచేసుకున్నారు. గద్ద జాతికి చెందిన బాల్డ్ ఈగల్ అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ KL రాహుల్ ఇవాళ తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. నేడు శ్రీలంకతో జరిగే మూడో వన్డేలో ఆయన ఈ ఘనత సాధించనున్నారు. ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడి 7,979 రన్స్ చేశారు. మరో 21 పరుగులు చేస్తే 8,000 పరుగుల క్లబ్‌లోకి చేరుకుంటారు. కాగా కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు రాహుల్ వెన్నెముకగా మారారు. మిడిలార్డర్లో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను రక్షించడం మన బాధ్యత అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఆ దేశంలోని మైనారిటీలను కాపాడుకోవాలని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘బంగ్లా అల్లర్లు ఆ దేశానికే పరిమితం కాదు. ఒకప్పటి అఖండ భారత్ ఇప్పుడు రణరంగంగా మారడం బాధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాకు మనం అండగా నిలవాలి. అలా చేయలేదంటే మనది మహా భారత్ కానే కాదు’ అని ట్వీట్ చేశారు.
ఏపీ క్యాబినెట్ సమావేశం ఇవాళ ఉ.11 గంటలకు జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో గుంటూరు, బాపట్ల(D) వేటపాలెంలో పర్యటించనున్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొని కార్మికులతో సమావేశమవుతారు.
కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్‌స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్‌చరణ్ కలిపి రూ.కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్‌లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.
రవితేజ ఫ్యాన్స్‌కు ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు సాయంత్రం 5గంటలకు ‘ఏఏఏ సినిమాస్’లో ట్రైలర్ లాంచ్ ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్మాణ సంస్థ ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల రీత్యా ఆ ఈవెంట్ రద్దైందని తాజాగా తెలిపింది. ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పింది. ఇక ట్రైలర్ విడుదల అదే సమయానికి ఉండనుందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.