India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నీరు పుష్కలంగా ఉండేచోట మొక్కలు నాటడం కామన్. కానీ, నీటిజాడ కనిపించని ఎడారిని పచ్చగా మార్చేందుకు ఓ వ్యక్తి కంకణం కట్టుకున్నారు. రాజస్థాన్‌లోని ఎకల్‌ఖోరి గ్రామంలో 80 ఏళ్ల రణారామ్ బిష్ణోయ్ ఎడారి ప్రాంతంలో 10 ఎకరాల్లో 50వేల చెట్లను నాటారు. గొట్టపుబావిలో నుంచి నీటిని తోడి మొక్కలు నాటిన ప్రాంతానికి వెళ్లి వాటికి నీరు పోస్తుంటారు. ఈయణ్ని ‘ట్రీ మ్యాన్’ అని పిలుస్తుంటారు. మొక్కలను దేవుడిలా పూజిస్తుంటారయన.
నాలుగు T20ల సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుంది. డర్బన్ వేదికగా రా.8.30 గంటలకు పోరు మొదలుకానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. టెస్ట్ సిరీస్‌లో కివీస్ చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిపించాలని సూర్య నేతృత్వంలోని కుర్రాళ్లు భావిస్తున్నారు. T20 WC ఫైనల్లో భారత్ చేతిలో ఓటమికి ఈ సిరీస్ ద్వారా కొంతైనా ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ జట్టు ఉవ్విళ్లూరుతోంది.
రోజూ ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా బదులు దీనిని తీసుకోవడం ఉత్తమం. చద్దన్నంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే రోజంతా ఉత్తేజంగా, శక్తిమంతంగా పనిచేస్తారు. పెరుగుతో కూడిన చద్దన్నంలో ఉల్లిపాయ, మిరపకాయ నంజుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. కుర్చీలో కూర్చుని పనిచేసేవారు తక్కువ, శారీరక శ్రమ చేసే వారు ఎక్కువగా తినొచ్చు.
AP: నేరాల నియంత్రణకు ఆధార్ డేటాను పోలీసులకు అప్పగించేందుకు కేంద్ర నిర్ణయించింది. ఇది నేర పరిశోధన ప్రక్రియలో మరింత వెసులుబాటు కలిగించేందుకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో అవసరమవుతుంది. వలస కూలీలు, పేదలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ డేటాను అందుబాటులోకి తేవాలని వివిధ రాష్ట్రాల పోలీసులు కేంద్ర హోంశాఖను కోరాయి. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ OSD ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు లభించినట్లు సమాచారం. ఇక ఆయన ఇప్పట్లో హైదరాబాద్ రారని, ఈ కేసు విచారణకు బ్రేక్ పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు.
AP: గత ప్రభుత్వంలో క్రీడా రంగాన్ని పట్టించుకోలేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ విమర్శించారు. విశాఖ, మంగళగిరి క్రికెట్ స్టేడియాల్లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ATP, VZM, మూలపాడులో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మన క్రికెటర్లు IPLకి సెలక్ట్ అయ్యేలా, రంజీ ట్రోఫీ, అండర్-19 ఆడేవారికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తామన్నారు.
TG: మేలో టెట్ రాసి ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకునేవారికి దరఖాస్తు ఫీజు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో క్వాలిఫై అయినా, కాకపోయినా అప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా ఈసారి ఉచితంగా ఎగ్జామ్ రాయొచ్చని పేర్కొంది. ఇక మేలో పెంచిన టెట్ దరఖాస్తు ఫీజును ఈసారి తగ్గించింది. గతంలో ఒక పేపర్‌కు రూ.1000, రెండు రాస్తే రూ.2000 ఉండగా ఇప్పుడు దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా నిర్ధారించింది.
కివీస్ చేతిలో వైట్‌వాష్ తర్వాత BGT కోసం సిద్ధమవుతున్న టీమ్ ఇండియా ఆటగాళ్లకు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు. క్రికెట్ బేసిక్స్‌కు తిరిగివెళ్లి తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలన్నారు. ‘రూమ్‌లో కూర్చుని మెరుగవుతానని మీరనుకుంటే ఎప్పటికీ జరగదు. ప్రస్తుతం మీకు కష్టకాలం నడుస్తోంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
కమ్యూనిస్టులు తమ రాజకీయ విధానంలో పెద్ద మార్పుకే శ్రీకారం చుట్టారు. మతం విషయంలో కొన్ని మినహాయింపులతో తీర్మాన ముసాయిదా పత్రాన్ని సీపీఐ(ఎం) అగ్రనాయకత్వం సిద్ధం చేసింది. మత ఆచరణ కలిగిన వారిని పార్టీలోకి చేర్చుకుని కలిసి పని చేయాలని నిర్ణయించింది. ఆర్ఎస్ఎస్ మాదిరిగానే ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రతిపాదించింది. అదే సమయంలో సోషలిజం సాధన, వామపక్షాల ఐక్యతను సాధించడాన్ని లక్ష్యంగా పేర్కొంది.
ఇరాన్‌ను హెచ్చరించేందుకు అమెరికా తమ F-15 ఫైటర్ జెట్‌ను మిడిల్ ఈస్ట్‌కు పంపింది. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఇప్పటికే ఆ దేశం బాంబర్స్, ఫైటర్, ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను అక్కడికి పంపింది. తమకు గానీ, తమ మిత్ర దేశాలకు గానీ ఇరాన్ ఏమైనా హానీ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూఎస్ హెచ్చరించింది.
Sorry, no posts matched your criteria.