India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్‌కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.

బతుకమ్మ పండుగలో రెండో రోజును ‘అటుకుల బతుకమ్మ’ అని అంటారు. ఈ రోజున బతుకమ్మను గునుగు, తంగేడు, నందివర్ధనం, బంతి, చామంతి, గుమ్మడి, బీర పూలతో పేర్చి, వాటిపై గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి. అటుకులు, బెల్లం, చప్పిడి పప్పులను నైవేద్యంగా సమర్పించి, వాటిని పిల్లలకు పంచిపెట్టాలి. ఈ నైవేద్యం పిల్లలకు ఇష్టం కాబట్టే ఈ రోజుకు ‘అటుకుల బతుకమ్మ’ అనే పేరు వచ్చిందని నమ్మకం. ఈరోజే దేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి.

టీవీలపై జీఎస్టీ శ్లాబు మార్పుతో పలు కంపెనీలు రూ.85వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. LG గరిష్ఠంగా టీవీల ధరలను రూ.85వేల వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో రూ.70వేల వరకు, పానాసోనిక్‌లోనూ మోడల్‌ను బట్టి రూ.7వేల వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. టూవీలర్స్‌లో రూ.18వేలు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.

1. దశరథుణ్ని వరాలు కోరమని కైకేయిని ప్రేరేపించింది ఎవరు?
2. మహాభారతంలో కాశీరాజు పుత్రికల పేర్లేంటి?
3. కృష్ణుణ్ని చంపడానికి అఘాసురుడు ఏ రూపం ధరించాడు?
4. శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి ఏ నదీ తీరాన కొలువై ఉంది?
5. శ్రీరాముడు రావణుడిని సంహరించిన సందర్భంగా ఏ పండుగను జరుపుకొంటారు?
<<-se>>#mythologyquiz<<>>

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రకటన ప్రకారం ఇవాళ్టి నుంచి దసరా సెలవులు అమల్లోకి వచ్చాయి. APలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు, TGలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు నిన్న ఆదివారం కలిసి రావడంతో ఇప్పటికే హాలిడేస్ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే OCT 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం మరుసటి రోజు సోమవారం(6న) బడిబాట పట్టే అవకాశముంది.

TG: సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.

ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Sept 22 – పరమన్నం/రైస్ ఖీర్
Sept 23 – కొబ్బరి అన్నం, అల్లపు గారెలు
Sept 24 – మినప వడలు/పులిహోర
Sept 25 – పాయసం, రవ్వ కేసరి
Sept 26 – పూర్ణాలు, రవ్వ కేసరి
Sept 27 – రవ్వ కేసరి/పాయసన్నం
Sept 28 – కట్టు పొంగలి, Sept 29 – పాయసం, శాఖన్నం
Sept 30 – కదంబం/కలగలుపు కూర
Oct 1 – చక్కెర పొంగలి, Oct 2 – దద్దోజనం, మహా నివేదన
Sorry, no posts matched your criteria.