India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలోని టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అమల్లోకి రానుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది టూరిస్టు పోలీసులు నేడు విధుల్లో చేరనున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలైన యాదాద్రి, భద్రాచలం, కీసరగుట్ట, సోమశిల తదితర ఆలయాలతో పాటు చార్మినార్, గోల్కొండ, అనంతగిరి హిల్స్ వంటి సందర్శక ప్రాంతాల్లో వీరు అందుబాటులో ఉంటారు.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 6 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.gov.in/

నిజమైన భక్తి అంటే ఆరాధన చేయడమే కాదు. సర్వం పరమాత్మే అని నమ్మాలి. ‘ఎవడు సమస్తమును నాయందు, నాయందు సమస్తమును చూచుచున్నాడో’ అనే గీతా వాక్యం దీన్ని బోధిస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు, జీవిలో ఆ దివ్యత్వాన్ని చూడగలగాలి. సమస్తాన్ని భగవంతుడికి సమర్పించిన భక్తుడిని పరమాత్మ ఎప్పటికీ విడవదు. ఇలాంటి అనన్య భక్తి కలిగి ఉండేవారే నిజమైన భక్తులు. ఈ జ్ఞాన దృష్టిని పెంపొందించుకోవడమే మన జీవిత పరమార్థం. <<-se>>#Daivam<<>>

బహిరంగ ప్రదేశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు నిషేధించాలని కర్ణాటక CM సిద్దరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. స్కూళ్లు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, మందిరాలు, పురాతన స్థలాలు తదితర చోట్ల RSS తమ శాఖలను నిర్వహిస్తోందని లేఖలో ప్రియాంక్ వివరించారు. సమాజంలో విభజనలు తీసుకొచ్చేలా ప్రచారం, నినాదాలు చేస్తోందని అభ్యంతరం తెలిపారు. అటు RSSను కాంగ్రెస్ ఏం చేయలేదని BJP మండిపడుతోంది.

కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు మలయాళ నటుడు సురేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. పెట్రోలియం శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆయన నిన్న BJP కార్యకర్తలతో మాట్లాడుతూ మనసులోని మాటను బయటపెట్టారు. ఆదాయం తగ్గడంతో మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. సినీ కెరీర్ వదిలిపెట్టాలని తాను ఎన్నడూ కోరుకోలేదన్నారు. తన పదవి కేరళకే చెందిన MP సదానందన్ మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు.

AP: సీఎం చంద్రబాబు ఈనెల 24న గల్ఫ్ టూర్‌కు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబిలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగే ప్రత్యేక సమావేశంలో P-4 కార్యక్రమం గురించి వివరించడంతోపాటు పెట్టుబడులపై చర్చించనున్నారు. ఈ మేరకు సీఎం టూర్‌కు కేంద్రం అనుమతిచ్చింది. ప్రవాసులతో భేటీకి అవసరమైన సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది.

ప్రస్తుతకాలంలో యూట్యూబ్, ఇన్‌స్టాల్లో వైరల్ అయ్యే వాటిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అవి కొనడం, వాడటం చేస్తున్నారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. సోషల్‌మీడియాలో చూపించేవన్నీ నిజం కావని చెబుతున్నారు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించేలా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన ఉత్పత్తులను చూసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

AP: మే నెల చివర్లో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ట్రాల నుంచి నిష్క్రమిస్తున్నాయి. 2 రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయే ఆస్కారం ఉండగా.. 3, 4 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ప్రకాశం, ఏలూరు, ప.గో. తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Sorry, no posts matched your criteria.