India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎస్సీ వర్గీకరణలో తీసుకోవాల్సిన చర్యలపై కూటమి పార్టీల ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించారు. దళితుల్లోని ఉపకులాలన్నింటికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే వర్గీకరణ అమలు చేశామని, న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయిందని సీఎం గుర్తు చేశారు.
అన్యోన్యమైన దాంపత్యానికి సూచనలు అంటే ఏం చెబుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమ, గౌరవం చూపించడం. అయితే తమ పార్ట్‌నర్‌ను ఆటపట్టించడం కూడా ఆరోగ్యకరమైన బంధంలో భాగమేనని కాన్సాస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 15వేల మందిపై అధ్యయనం చేసి, దంపతుల మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ బంధాన్ని బలపరుస్తాయని తేల్చారు. అయితే హాస్యమేదైనా భాగస్వామిని తీవ్రంగా ఎగతాళి చేసే స్థాయికి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సంగెం నుంచి భీమలింగంలోని మూసీ నది వరకు 2.5 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.
పన్ను ఎగవేత ఆరోపణలపై ట్రూకాలర్ ఆఫీసుల్లో IT అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ ఆఫీసుల్లో తనిఖీలు జరిపారు. పన్ను ఎగవేత సహా, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ (అనుబంధ సంస్థల మధ్య లావాదేవీలు) విషయమై అధికారులు డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా చేసిన తనిఖీలపై అధికారులకు సహకరించినట్టు ట్రూకాలర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణలో బీసీల జనాభా 50% పైగా ఉంది. స్థానిక సంస్థల్లో వీరికి 29% రిజర్వేషన్ అమలవుతోంది. తాము గెలిస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో చెప్పింది. అందులో భాగంగానే ప్రస్తుత రేవంత్ సర్కారు కులగణన సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరుతో సర్వే పూర్తి కానుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందా? లేదా? అనేది చూడాలి.
TG: సర్పంచుల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. BRS నేతల రెచ్చగొట్టే మాటలు ఎవరూ నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. సర్పంచులకు చెందాల్సిన నిధులను BRS ప్రభుత్వం దారి మళ్లించలేదా? 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణం కాలేదా? అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని ఆయన అన్నారు.
శీతాకాలం వచ్చేసింది. అనేక ఆరోగ్య సమస్యలు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్స్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పండ్లు, పాల పదార్థాలు, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి సమృద్ధిగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
AP: ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టుషాపులను ఉపేక్షించవద్దని ఆదేశించారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలు ఇవ్వాలని సూచించారు. కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని మారుద్దామని పిలుపునిచ్చారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు.
AP: ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసనలు చేపట్టనుంది. ఈ నెల 19, 20న ప్రొటెస్ట్ చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని సూచించింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్‌ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.
కాంగ్రెస్ పార్టీ వేగంగా పతనమవుతోందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ‘ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పట్టు తప్పింది. ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం మొదటిది. ప్రజలతో సంబంధాలు తెగిపోవడం రెండోది. భారతదేశ విజన్‌కు దూరమవ్వడం మూడోది. ఈ మూడూ లేనప్పుడు పార్టీని ప్రజలు నమ్మడం మానేస్తారు. ప్రస్తుతం దాని దుస్థితి ఇదే’ అని అన్నారు. 2020లో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు.
Sorry, no posts matched your criteria.