India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.

ఇంగ్లండ్ బౌలర్ సోనీ బేకర్ అరంగేట్ర మ్యాచులోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బేకర్ 7 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో డెబ్యూట్ మ్యాచులో అత్యధిక పరుగులు ఇచ్చిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా ఆయన నిలిచారు. అటు బ్యాటింగ్‌లోనూ బేకర్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది. ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారని పేర్కొంది. 12 రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ వేడుకలు గత నెల 25న ప్రారంభమయ్యాయి. గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ హాజరవుతారని వెల్లడించింది. ఆంధ్ర సరిహద్దుల్లోని ఈ గ్రామంలో జరిగే ఉత్సవాల్లో ఒడిశా ఆదివాసీలూ పాల్గొంటారు.

TG: వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు ఆదిలాబాద్‌లో ఈ నెల 4-6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తర్వాత ఒడిశా మీదుగా కదలనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

RBI తీసుకొచ్చిన కొత్త రూ.10, 20, 50 నోట్ల మన్నికపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ కొత్త నోట్లు త్వరగా పాడైపోతున్నాయని, పాత నోట్లలాగా మన్నికగా లేవని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. నాణ్యతలోపం వల్ల తయారైన ఆరేళ్లకే చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం వంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు. ఓల్డ్ మోడల్ నోట్లు ఇప్పటికీ చెక్కుచెదరలేవని గుర్తుచేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి. SHARE IT

TG: ఈ తరానికి వైఎస్ ఒకరే, కేవీపీ ఒకరే ఉంటారని సీఎం రేవంత్ కొనియాడారు. కేవీపీ రామచంద్రరావులాంటి వారు తనకు ఎక్కడా కనిపించలేదని ప్రశంసించారు. ‘కేవీపీలా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలి. కానీ కొందరు నా దగ్గరికి వచ్చి కేవీపీలా ఉంటానంటారు. ఎవరినైనా మొదటి వారం ఆఫీస్ లోపలికి రానిస్తే, రెండో వారం నా కుర్చీలోనే కూర్చుంటామంటారు. ఇది నా అనుభవంతో చెబుతున్నా’ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయగా రేపు ఆయన తరఫు లాయర్ వాదనలు విననుంది. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ పైనా విచారణను రేపటికి వాయిదా వేసింది.

హీరోయిన్ పార్వతి మెల్టన్ తల్లి కాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇవి చూసిన అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా వెన్నెల, జల్సా, దూకుడు, శ్రీమన్నారాయణ, మధుమాసం వంటి సినిమాలతో పార్వతి ప్రేక్షకులను అలరించారు. 2012లో వ్యాపారవేత్త షంసు లాలానిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలయ్యారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు.

AP: <<17594800>>సుగాలి ప్రీతి<<>> 2017లో స్కూల్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. అయితే ఆమెను హత్యాచారం చేశారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లోనే ఈ కేసును అప్పటి YCP ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దర్యాప్తు చేయడం తమవల్ల కాదంటూ కోర్టుకు CBI తెలిపింది. కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని ప్రీతి తల్లి పార్వతి డిమాండ్‌తో మరోసారి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
Sorry, no posts matched your criteria.