India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తొలిసారి ఇండియాలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో టేలర్ ప్రదర్శన ఇస్తారని సినీవర్గాలు తెలిపాయి. అత్యంత పాపులర్ సింగర్ పర్ఫార్మెన్స్ కావడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ టీమ్ చర్చలు జరిపిందని, త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నాయి.

HYDలోని నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఉదయం నుంచి <<15210747>>ఐటీ సోదాలు <<>>కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా ఆయన భార్య తేజస్వినిని అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. SVC సంస్థ బ్యాలెన్స్ షీట్లు, ITR వివరాలను పరిశీలిస్తున్నారు. దిల్ రాజ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అటు మైత్రి మూవీ మేకర్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

క్రైమ్‌సీన్ రీక్రియేషన్‌తో యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడికేసులో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఫింగర్‌ప్రింట్స్‌ను వారు సేకరించారు. అతడు బాత్రూమ్ కిటీకి గుండా ఇంటిలోకి చొరబడినట్టు గుర్తించారు. కాగా మధ్యాహ్నం 2PM తర్వాత లీలావతీ ఆస్పత్రి నుంచి సైఫ్ డిశ్చార్జ్ అవుతారని తెలిసింది. దాడి జరిగిన బాంద్రా ఇంటికి కాకుండా ఫార్చూన్ హైట్స్ గృహానికి వెళ్తారని సమాచారం.

ICC టోర్నీల సమయంలో హోస్ట్ నేషన్ పేరు మిగతా దేశాల జెర్సీలపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న పాకిస్థాన్ పేరును తమ జెర్సీపై ఉంచేందుకు భారత్ నిరాకరించినట్లు PCB తెలిపింది. ఈ విషయంలో ICC పాక్‌కు మద్దతు ఇవ్వాలని, జెర్సీపై పేరు పెట్టకపోవడాన్ని సమర్థించవద్దని PCB ప్రతినిధులు కోరారు. అలాగే టోర్నీ ప్రారంభ వేడుకకూ కెప్టెన్ రోహిత్‌ను తమ దేశానికి పంపాలని BCCI అనుకోవడం లేదని చెప్పారు.

ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఛావా’ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్యగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రష్మిక లుక్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.

ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు. ‘నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో ఇరు రాష్ట్రాల బలగాలు, CRPF జాయింట్ ఆపరేషన్‌లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. దేశంలో నక్సలిజం ఊపిరులు చివరికి చేరాయి’ అని ట్వీట్ చేశారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకానొక దశలో 800pts పతనమైన సెన్సెక్స్ 77,337 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాసేపటికే పుంజుకొని 70pts లాభంతో 77,141 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 150pts తగ్గిన నిఫ్టీ 23,426 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు 30pts పెరిగి 23,376 వద్ద చలిస్తోంది. ట్రంప్ టారిఫ్స్, అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణాలు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచేందుకు అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం చాహల్ (80 మ్యాచుల్లో 96 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ 2 వికెట్లు తీస్తే చాలు చాహల్‌ను అధిగమిస్తారు. ఆయన ఇప్పటివరకు 60 మ్యాచులాడి 95 వికెట్లు తీశారు. కాగా ENGతో సిరీస్‌కు చాహల్ సెలక్ట్ కాని విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలిరోజు ట్రంప్ బిజీబిజీగా గడిపారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తొలిరోజున 42 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్/ మెమోరాండం/ ప్రకటనలు చేశారు. 115 మంది సిబ్బందిపై, 200 కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 60 నిమిషాల పాటు ప్రెస్‌తో మాట్లాడారు. ఒక్కరోజులో 3 చారిత్రక ప్రసంగాలు ఇచ్చి తన మార్క్ చూపించారు.

హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్-జైనబ్ రవ్జీల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే పెళ్లి పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కొన్ని నెలల కింద వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.