India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఈ సినిమాలో నటించాలని మీకు ఆఫర్ వచ్చిందా?’ అని హీరో విక్రమ్‌ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. రాజమౌళి, తాను అప్పుడప్పుడూ మాట్లాడుకుంటామని, భవిష్యత్తులో కలిసి సినిమా చేయాలనుకున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మాట్లాడుకోలేదని తంగలాన్ మూవీ ప్రమోషన్లలో తెలిపారు.
AP: జగన్ సీఎంగా ఉన్నప్పుడు అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మాజీ సీఎం హోదాలో నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించామని తెలిపింది. తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ <<13783949>>హైకోర్టుకు<<>> వెళ్లడంతో అధికారులు స్పందించారు. చంద్రబాబు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్‌కు అలాగే ఇచ్చామన్నారు.
TG: రాష్ట్రంలో 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. ఈ పరీక్షకు 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా 2,45,263 మంది హాజరయ్యారు. హాజరు శాతం 87.61గా నమోదైంది. త్వరలోనే కీ విడుదల కానుంది. సెప్టెంబర్ 5కల్లా నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో 12 దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 14న సేవలు ప్రారంభం కానుండగా నేటి నుంచే బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సీఈవో ఎల్బర్స్ తెలిపారు. ఏ231 నియో విమానాల్లో మూడు వరుసల్లో 4 చొప్పున 12 బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఈ విమానాల్లో 208 ఎకానమీ సీట్లతో కలిపి మొత్తం 220 సీట్లు ఉండనున్నాయి.
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు ఐఎంఎంఎస్ యాప్‌లో ఈ ఆప్షన్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం రోజుకో ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
15 ఏళ్ల షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందింది. జీడీపీ వృద్ధిలో వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెడీమేడ్ దుస్తుల హబ్‌గా ఎదిగింది. మరోవైపు విపరీతమైన అవినీతి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్యకు తోడు రిజర్వేషన్లతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి అదుపుతప్పి హసీనా పదవీచ్యుతురాలయ్యారు.
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని, సొంతంగా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని వర్సిటీ రిజిస్ట్రార్‌లను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు పలు యూనివర్సిటీలకు లేఖ రాసింది. సర్టిఫికెట్లు అందకపోవడంతో ఉన్నత విద్య కోర్సుల్లో, ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
AP: ప్రజలతో అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు అన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అశాంతి నెలకొందని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. గత ప్రభుత్వం కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పులు చేసి భూములు కాజేసిందన్నారు. భూములను ఫ్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని దుయ్యబట్టారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకోవడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం ఇంకా కలగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాపైనే దేశం మరోసారి ఆశలు పెట్టుకుంది. ఇవాళ జావెలిన్ త్రో క్వాలిఫయర్‌లో ఆయన బరిలో దిగుతున్నారు. దీంతో నీరజ్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు మెన్స్ హాకీ సెమీఫైనల్లో ఇవాళ భారత్, జర్మనీతో తలపడనుంది. ఇవాళ్టి పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
TG: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరగనుంది. భవిష్యత్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యేలా కార్యచరణను రూపొందించడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపై ప్రత్యేక చర్చ చేపట్టే అవకాశముంది. గత ఎన్నికల వైఫల్యాలను రిపీట్ కానివ్వకుండా దిద్దుబాటు చర్యలకు భేటీలో నేతలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.