India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE)లో 212 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 142 సూపరింటెండెంట్(డిగ్రీ అర్హత), 70 జూనియర్ అసిస్టెంట్(ఇంటర్ అర్హత) ఉద్యోగాలున్నాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ సూపరింటెండెంట్‌కు రూ.35,400-రూ1,12,400, JAకు రూ.19,900-రూ.63,200 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
TG: ఉగాది సందర్భంగా గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీతో మీటింగ్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. సినీ ఇండస్ట్రీ వాళ్లు అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామన్నారు. మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని భట్టి స్పష్టం చేశారు.
రైల్వే కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు సాధ్యంకాదు. ప్రస్తుతం ఇండియాలో చాలా ప్రాంతాలకు రైల్వే మార్గం లేదు. మన దేశంలో మొత్తం 68,525 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే, మన కంటే కూడా అభివృద్ధిలో దూసుకెళ్తోన్న అమెరికా, చైనా, రష్యా దేశాలు ఎక్కువ రైల్వే కనెక్టివిటీని కలిగిఉన్నాయి. అమెరికాలో 2.50 లక్షల కి.మీలు, చైనాలో 1.24 లక్షల కి.మీలు, రష్యాలో 86వేల కి.మీల రైలు మార్గం ఉంది. ఇండియా నాలుగో స్థానంలో ఉంది.
రోహిత్ శర్మ తర్వాత వన్డే, టీ20 జట్లకు హార్దిక్ పాండ్యకే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ఒక దశలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయితే తరచూ గాయాల పాలవుతుండటం, నిలకడలేమితో బీసీసీఐ అతడిని పరిగణనలోకి తీసుకోవట్లేదు. భవిష్యత్తులోనూ అతని కెప్టెన్సీ కల కల్లగానే మిగిలిపోనుందని విశ్లేషకుల అంచనా. టీ20లకు సూర్య(కెప్టెన్), అక్షర్(VC)కు అవకాశం ఇవ్వగా, వన్డేల్లో రోహిత్‌కు డిప్యూటీగా గిల్‌ను ప్రమోట్ చేస్తోంది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు STT గ్లోబల్ డేటా సెంటర్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సంస్థ రూ.3500 కోట్లతో మీర్‌ఖాన్‌పేట్‌లో ఆర్ట్ డేటా సెంటర్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని వెల్లడించారు. సింగపూర్ పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ సంస్థకు హైటెక్ సిటీలో ఇప్పటికే ఓ ఆఫీస్ ఉంది.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు అక్కడికి బయల్దేరారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ముంబైకి తరలించనున్నారు. షాలీమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో అతడు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
AP: మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 1.50 గంటల మధ్య డ్రోన్ ఆ ప్రాంతంలో తిరిగింది. దీంతో జనసేన నేతలు డీజీపీతోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
AP: తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతుండటంపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. అన్ని ఘటనలపై నివేదిక ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనున్నారు. తిరుపతిలో తొక్కిసలాట, తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, రూ.300 టికెట్ల స్కామ్, తాజాగా కొండపై ఎగ్ బిర్యానీ కలకలం రేపిన విషయం తెలిసిందే.
APCPDCL పరిధిలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందని వస్తున్న వార్తలను డిస్కంలు ఖండించాయి. పొగ మంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడటంతో రెండు రోజులుగా కరెంటు సరఫరా సమయాన్ని రీషెడ్యూల్ చేశామని తెలిపాయి. నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఉత్తమ్ స్పందించారు. అలాంటిదేమీ ఉండదని, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.