India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉద్యోగంలో విరామం తీసుకుని, మళ్లీ చేరాలనుకుంటున్న మహిళల కోసం పలు కంపెనీలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. మహిళా ఇంజినీర్ల కోసం టాటా టెక్నాలజీస్ ‘రీఇగ్నైట్ 2025’, ‘రిటర్న్‌షిప్’ కార్యక్రమాన్ని హెచ్‌సీఎల్ టెక్, మహిళా నిపుణుల కోసం ఇన్ఫీ ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్’ అనే కార్యక్రమాలు ప్రారంభించాయి. యాక్సెంచర్ ఇండియా ‘కెరీర్ రీబూట్’, విప్రో ‘బిగిన్ ఎగైన్’ కూడా ఇదే కోవలోకి వస్తాయి.

TG: దసరాలోగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారి లిస్టు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 783 పోస్టులకు ఈనెల 13న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విషయం తెలిసిందే. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురైన కారణంగా ముందుగా గ్రూప్-2 రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పండగకు ముందే తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

రాజ్యాంగ సవరణ-52తో 1985లో చేర్చిన పదో షెడ్యూల్లో ఫిరాయింపుల గురించి ఉంది. శాసన సభ్యులు ఎన్నికైన పార్టీకి రిజైన్ చేస్తే ఫిరాయించినట్లు. ఓటింగ్‌కు హాజరుకావాలని విప్ జారీ చేస్తే రాకపోయినా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా స్పీకర్/ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసి తొలగింపజేయొచ్చు. గెలిచాక మరో పార్టీలో చేరినా ఫిరాయింపే అని ఉన్నా.. <<17762540>>చేరారు<<>> అనే నిర్ధారణ వివరించలేదు. స్పీకర్ విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు.

1. శ్రీరాముడి పాదధూళితో ‘అహల్య’ శాపవిముక్తురాలైంది.
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. కృష్ణద్వైపాయనుడు అంటే ‘వేద వ్యాసుడు’.
4. మధుర మీనాక్షి దేవాలయం ‘వైగై నది’ ఒడ్డున ఉంది.
5. చిరంజీవులు ఏడుగురు. వారు 1. అశ్వత్థామ 2. బలి చక్రవర్తి 3. వ్యాస మహర్షి 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపాచార్యుడు 7. పరశురాముడు <<-se>>#mythologyquiz<<>>

ఓ ప్రైవేట్ యాడ్ షూట్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్ <<17762493>>గాయపడ్డ<<>> విషయం తెలిసిందే. సెట్లో చీకటి ఉండటంతో స్టేజీ ఎడ్జ్ నుంచి ఆయన జారి కిందపడ్డట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో తారక్ పక్కటెముకలు, చేతికి స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. చికిత్స అనంతరం తారక్ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

AP అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు సందర్భంగా పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

ఏపీ, తెలంగాణలో మెజార్టీ ప్రాజెక్టులు తానే ప్రారంభించానని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఇప్పుడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నట్లు చెప్పారు. గతంలో పులివెందులకు కూడా తామే నీళ్లిచ్చామన్నారు. కుప్పానికి కృష్ణా జలాలు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందని సీఎం వెల్లడించారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

TG: నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌పై CM రేవంత్ స్పందించారు. ‘నక్సలైట్లు లొంగిపోవడానికి గత ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశముంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించడంలో ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? నక్సలైట్ల లొంగుబాటు విషయంలో కేంద్రం దయ చూపాలి’ అని వ్యాఖ్యానించారు.

AP: నియోజకవర్గాల్లో జలాశయాలు నింపుకొని, ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన బాధ్యత MLAలపై ఉందని CM చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘వర్షాకాలం తర్వాత 3మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా చూడాలి. ఈ ఏడాది 2.1% వర్షపాతం తక్కువగా ఉంది. గతేడాది 18% అధిక వర్షపాతం నమోదైంది. గతేడాదితో పోలిస్తే 1.25మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరవు అనే మాట రాదు’ అని తెలిపారు.

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.
Sorry, no posts matched your criteria.