India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. SSD టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో నూతన షెడ్లు, క్యూలైన్ల మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించింది. బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు 3కి.మీ మేర రూ.17.60 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనుంది. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంటను సాగు చేస్తున్నప్పుడు సుడిదోమ ఉద్ధృతి పెరిగితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వరి పొలంలో కాలిబాటలను తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20 నుంచి 25 చొప్పున అమర్చాలి. 5 నుంచి 6 లీటర్ల తూటికాడ, కుంకుడు కాయల రసాన్ని 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారీ చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 81 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని NOV 10 లోపు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. పోస్టును బట్టి PhD, మాస్టర్ డిగ్రీ, NET, CSIR, BE, బీటెక్, ME, ఎంటెక్, MS, MBBS, డిగ్రీ, ఇంటర్ , టెన్త్, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cuk.ac.in/

కార్తీక మాసంలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆయనకు అభిషేకాలు చేస్తే శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఒక్కో అభిషేకంతో ఒక్కో ఫలితముంటుందని పండితులు చెబుతున్నారు. అపమృత్యు భయం పోవడానికి నువ్వుల నూనె అభిషేకం ఉత్తమం అంటున్నారు. ఫలితంగా అకాల మరణ భయం దరిచేరదని పేర్కొంటున్నారు. ‘నువ్వుల నూనె శని దేవునికి ప్రీతిపాత్రమైనది. శివుడిని ఈ నూనెతో అభిషేకిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి’ అని సూచిస్తున్నారు.

మొంథా తుఫాను తెలంగాణపై విరుచుకుపడుతోంది. కుండపోత వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇవాళ సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఏపీలోని విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి(ప్రైమరీ స్కూల్స్) జిల్లాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చారు. మరి మీ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవు ఉందా? COMMENT

టారిఫ్‌ల తగ్గింపు కోసం తమకు 350B డాలర్లు చెల్లించేందుకు ద.కొరియా ఒప్పుకుందని US ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్నారు. US నుంచి ఆయిల్, గ్యాస్‌ను భారీ మొత్తంలో కొనేందుకు కూడా ద.కొరియా అంగీకరించిందని తెలిపారు. ఆ దేశ కంపెనీలు USలో పెట్టే పెట్టుబడుల విలువ $600Bను మించిపోతుందన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణానికి వారికి అనుమతినిచ్చినట్లు చెప్పారు.

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 532 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ పాసై 20- 28ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మొత్తం పోస్టుల్లో APలో 7, TGలో 8 ఖాళీలున్నాయి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: uco.bank.in/

ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే మూల విరాట్టును చూడాలంటారు. అంతటి ప్రాధాన్యం దీనికుంది. ఆలయ నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగా, ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా దీనిని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభానికి కూడా దీపారాధనలు, ఉపచారాలు చేస్తారు. ఆలయ ద్వారాలు మూసి ఉన్నా, ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే నిద్రలేమితో అందం కూడా దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సరైన నిద్రలేకపోతే శరీరం pH దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.