India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ముంబై VS జమ్మూకశ్మీర్ 3 రోజుల రంజీ మ్యాచులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొననున్నారు. ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్ చివరిసారిగా 2015లో రంజీ ఆడారు. ముంబైకి అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లాంటి జాతీయ క్రికెటర్లు ఉన్నారు.

TG: రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు BRS ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు 2 వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేస్తారని తెలిపింది. అధ్యయనం అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని, బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని KTR పేర్కొన్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ‘కల్కి-2’ సినిమాపై నిర్మాత అశ్వనీ దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రభాస్ కోసం వెయిట్ చేశాను. కాల్ షీట్స్ ఇవ్వడంతో కల్కి తీశాను. జూన్ నెల నుంచి కల్కి-2 సినిమా షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఒకేసారి ఫౌజీ, కల్కి-2, స్పిరిట్ సినిమాలు చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన 8 రోజుల్లోనే రూ.156+ కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అటు నార్త్ అమెరికాలోనూ భారీగా వసూళ్లు రాబడుతుండటం విశేషం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు.

ఇకపై తాను ‘సత్య’లాంటి సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు డైరెక్టర్ RGV తెలిపారు. ఇటీవల ‘సత్య’ మూవీని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని, ఆ సినిమాను బెంచ్ మార్క్‌గా పెట్టుకుని తాను మరింత సిన్సియర్‌గా మూవీస్ తీసి ఉండాల్సిందని అన్నారు. ‘నేను పొందిన విజయాల మత్తులో, అహంకారంతో ఏవేవో సినిమాలు తీసేశాను. సత్య నా కళ్లు తెరిపించింది. ఇక నుంచి నా గౌరవం పెంచే సినిమాలనే తీస్తా’ అని ట్వీట్ చేశారు.

AP: నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. కూటమి నేతలు చర్చించుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని తేల్చి చెప్పింది.

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక కనిపించవని ఆందోళన చెందిన మందుబాబులకు యునైటెడ్ బ్రూవరీస్ గుడ్ న్యూస్ తెలిపింది. బీర్ల నిల్వలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం బీర్ల సరఫరాపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలపడంతో వినియోగదారులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ వెనక్కి తగ్గినట్లు పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. COIN DCX ప్రకారం తొలిసారిగా ₹కోటి విలువను దాటేసింది. గత 24 గంటల్లో ₹3.81లక్షలు పెరిగిన BTC ₹1.06 కోట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ₹1.04 కోట్ల వద్ద చలిస్తోంది. డాలర్ పరంగా చూస్తే $1,09,588 వద్ద గరిష్ఠాన్ని అందుకొని ప్రస్తుతం $1,08,491 వద్ద ట్రేడవుతోంది. 24 గంటల్లో $8000 ఎగిసింది.

ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశామని, కానీ కోర్టు జీవిత ఖైదు విధించిందని చెప్పారు. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని అన్నారు. ఒకవేళ పోలీసుల చేతుల్లోనే ఉంటే వారు దోషికి మరణశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని పేర్కొన్నారు.

సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన దొంగను పట్టుకోవడంలో గూగుల్ పే కీలకంగా మారింది. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు షరీఫుల్ ఇస్లాం వర్లీలో పరోటా తిని వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. వాటికి గూగుల్ పే ఉపయోగించాడు. ఇస్లాం నంబర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు ఆ లొకేషన్‌కు వెళ్లారు. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపై టార్చ్ లైట్ వేసి చూడగా అతడు పరుగు తీశాడు. అతడిని పట్టుకోగా ఆ వ్యక్తే నిందితుడని తేలింది.
Sorry, no posts matched your criteria.