News January 20, 2025

Stock Markets: ఉరకలెత్తిన సూచీలు

image

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, బ్యాంకు, ఫైనాన్స్ స్టాక్స్ అండతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 77,073 (+454), నిఫ్టీ 23,344 (+141) వద్ద ముగిశాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ కొనసాగింది. కొటక్ బ్యాంకు, విప్రో, బజాజ్ ట్విన్స్, NTPC టాప్ గెయినర్స్. SBI లైఫ్, TRENT, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC లైఫ్, అదానీ SEZ టాప్ లూజర్స్.

News January 20, 2025

మిస్టరీ జబ్బు: తలపట్టుకున్న ప్రభుత్వం!

image

JK రాజౌరీ (D) బాదాల్‌లో వేధిస్తున్న <<14924304>>వింత<<>> జబ్బుతో ప్రభుత్వం తలపట్టుకుంది. మహ్మద్ అస్లామ్ ఇంట ఆరో బిడ్డ చనిపోవడంతో మృతుల సంఖ్య మొత్తం 17కు చేరుకుంది. DEC 17 నుంచి ఈ మారణహోమం కొనసాగుతోంది. డిసెంబర్లో ఓ 2 కుటుంబాలు తద్దినం వంటిది ఏర్పాటు చేసి భోజనాలు చేశాయి. అప్పట్నుంచి వరుసగా పిల్లలు, పెద్దలు చనిపోతుండటంతో మొబైల్ లేబొరేటరీని పంపారు. ఇప్పుడు HM అమిత్ షా కేంద్ర, రాష్ట్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు.

News January 20, 2025

బడ్జెట్ 2025: NPSను అట్రాక్టివ్‌గా మారిస్తే..

image

NPSను మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఇండస్ట్రీ వర్గాలు FM నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నాయి. అలా చేస్తేనే స్కీమ్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అంటున్నాయి. 80CCD(1B) డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుంచి లక్షకు పెంచాలని సూచించాయి. 80CCD(2) కింద ఓల్డ్ రెజిమ్‌లో బేసిక్ శాలరీలో 10%, న్యూ రెజిమ్‌లో 14% వరకు జమ చేయొచ్చు. దీనిని 20%కు పెంచితే ప్రైవేటు ఉద్యోగులు స్కీమ్‌ను ఎంచుకుంటారని పేర్కొన్నాయి.

News January 20, 2025

పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్

image

AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించాలన్నారు. క్లస్టర్ గ్రేడ్ల విభజనకు ఆదాయం, జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ నివేదిక ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని కేటాయించాలన్నారు.

News January 20, 2025

సంభల్ అల్లర్లు: పాక్ కుట్రపై డౌట్!

image

సంభల్ అల్లర్లలో పాక్ కుట్రకోణంపై డౌట్ వస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపిన ముల్లా అఫ్రోజ్‌కు దావూద్ ఇబ్రహీం గ్యాంగుతో సంబంధాలు బయటపడటమే ఇందుకు కారణం. లగ్జరీ కార్ల చోరీ మాస్టర్ మైండ్ షారిక్ షాటా తరఫునే తానీ పనిచేసినట్టు అఫ్రోజ్ అంగీకరించాడు. అతడు కాల్చిన .32 పిస్టల్ బుల్లెట్లు పాక్‌లో తయారైనవే. షారిక్‌కు ISI, D గ్యాంగుతో లింక్ ఉన్నట్టు తెలిసింది. ఇక సంభల్ కేసులో 70 మందిని అరెస్టు చేయడం తెలిసిందే.

News January 20, 2025

₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్

image

ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.

News January 20, 2025

BIG BREAKING: కోల్‌కతా హత్యాచార దోషికి శిక్ష ఖరారు

image

దేశంలో సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, ₹50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 2024 AUG 9న RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.

News January 20, 2025

LSG కెప్టెన్‌గా రిషభ్ పంత్

image

ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను నియమించింది. వచ్చే సీజన్ నుంచి పంత్ తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ప్రకటించారు. వేలంలో పంత్‌ను LSG రూ.27కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ వికెట్ కీపర్-బ్యాటర్ ఆ జట్టుకు తొలి ట్రోఫీని అందిస్తారేమో వేచి చూడాలి.

News January 20, 2025

కోర్టు హాలులోకి వచ్చిన జడ్జి

image

కలకత్తా హత్యాచార ఘటన తీర్పు కాసేపట్లో వెల్లడికానుంది. తీర్పును చదివేందుకు జడ్జి అనిర్బన్ దాస్ కొద్ది క్షణాల క్రితమే కోర్టు హాలులోకి వచ్చారు. ఈ కేసులో తీర్పు కోసం దేశమంతా ఎదురుచూస్తోంది.

News January 20, 2025

కోర్టు బయట భారీగా గుమిగూడిన ప్రజలు

image

కాసేపట్లో కలకత్తా హత్యాచార ఘటనలో దోషి సంజయ్‌కు శిక్ష ఖరారు కానుంది. దీంతో తీర్పు వెల్లడించే సీల్దా కోర్టు వద్దకు RG Kar మెడికల్ కాలేజ్ విద్యార్థులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. దోషికి గరిష్ఠ శిక్ష విధించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అటు కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. న్యాయమూర్తి అనిర్బన్ దాస్‌కూ భద్రత కేటాయించారు.