News November 6, 2024

పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?

image

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

News November 6, 2024

అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి

image

AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.

News November 6, 2024

నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యం: మంత్రి రవీంద్ర

image

AP: మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాణ్యమైన మద్యం అమ్మడమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆబ్కారీ శాఖ ల్యాబ్‌ల్లో అత్యాధునిక పరీక్షలు చేస్తామని తెలిపారు. బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌కు 13 ప్రామాణిక పరీక్షలు ఉంటాయన్నారు.

News November 6, 2024

సిరీస్ ఆస్ట్రేలియాదే: పాంటింగ్

image

టీమ్ ఇండియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ లేదా రిషభ్ పంత్ ఎక్కువ రన్స్ చేస్తారని తెలిపారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ అత్యధిక వికెట్లు తీస్తారని అంచనా వేశారు.

News November 6, 2024

మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి

image

AP: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తనను తిట్టిన CM చంద్రబాబు ఇవాళ మెచ్చుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ట్వీట్ చేశారు. ‘శెభాష్ సుభాష్ అంటూ సీఎం చంద్రబాబు మెచ్చుకోలు నాకు కొండంత బలం. మొన్న తిట్టిన ఆయన ఈరోజు భుజం మీద చెయ్యి వేసి బాగా చేశావయ్యా.. ఓటర్ రిజిస్ట్రేషన్ 90% దాటించావ్ అంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. తిట్టినా మెచ్చుకున్నా మాకు అన్ని ఆయనే’ అని సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశారు.

News November 6, 2024

OTTల్లోకి కొత్త సినిమాలు

image

ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
*నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)
*నవంబర్ 8: ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయన్’, అనుపమ్ ఖేర్ ‘విజయ్ 69’ (నెట్‌ఫ్లిక్స్), సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ (ఆహా), బాలకృష్ణ, సూర్య ‘అన్‌స్టాపబుల్’ షో (ఆహా)

News November 6, 2024

నవంబర్ 14న విద్యార్థులతో కార్యక్రమం: సీఎం రేవంత్

image

TG: నవంబర్ 14న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు వైరా, మధిర గురుకుల విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. SC, ST, BC, మైనార్టీల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

News November 6, 2024

ఈ ఏడాది నం.1గా ‘పుష్ప-2’: మైత్రీ మూవీ మేకర్స్

image

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ ఏడాది IMDBలో అత్యధిక మంది ఎదురు చూస్తున్న భారతీయ చిత్రాల్లో నం.1గా పుష్ప-2 ఉందని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా ఈ నెలలో మూవీ టీజర్ రానున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

News November 6, 2024

అంబటికి హోంమంత్రి అనిత కౌంటర్

image

AP: తాను మైక్ ముందు మాట్లాడే హోంమంత్రినే కాదని, స్త్రీ జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడే వారిని లాఠీతో మక్కెలిరగ్గొట్టించే హోంమంత్రినని <<14528470>>అంబటి రాంబాబుకి<<>> అనిత కౌంటర్ ఇచ్చారు. వావివరుసలు మరిచి ఆంబోతుల్లా సోషల్ మీడియాలో విరుచుకుపడే విపరీతాలని గట్టిగా ఎదిరించే విపత్తు నిర్వహణ శాఖ మంత్రినని పేర్కొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఉన్మాదంగా ప్రవర్తించే వారిని చట్టప్రకారం శిక్షించే హోంమంత్రినని బదులిచ్చారు.

News November 6, 2024

‘ఆమె’కు అందని ద్రాక్షలా అమెరికా

image

US ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్‌తో పోరాడిన కమల ఓడారు. దీంతో మరోసారి పురుషుడే ఆ దేశాన్ని పాలించనున్నారు. చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా US ప్రెసిడెంట్ కాలేదు. గతంలో మార్గరెట్ చేస్ స్మిత్, షెల్లీ చిసమ్ అభ్యర్థిత్వానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ దశను దాటిన హిల్లరీ క్లింటన్, కమల ఎన్నికల దశలో నిష్క్రమించారు. దీంతో ఆడవాళ్లకు అమెరికా అధ్యక్ష పీఠం అందని ద్రాక్షగా మారింది.