India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టర్కీ స్టైలిష్ షూటర్ <<13750054>>యూసుఫ్<<>> టెస్లా CEO ఎలాన్ మస్క్‌కు ఆహ్వానం పలికారు. ‘భవిష్యత్తులో రోబోట్లు తమ చేతులను జేబులో పెట్టుకుని ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధిస్తాయని మీరనుకుంటున్నారా? దీనిపై ఇస్తాంబుల్‌లో డిస్కస్ చేద్దాం’ అని ట్వీట్ చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘రోబోట్లు ప్రతిసారీ టార్గెట్లను చేరుకుంటాయి. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో పర్యటనకు ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు.
హెజ్బొల్లా అనేది లెబనాన్ దేశానికి చెందిన షియా ముస్లిం మిలిటెంట్- రాజకీయ సంస్థ. ఇది 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత, ఇరాన్, సిరియా మద్దతుతో 1985లో ఏర్పడింది. ఇజ్రాయెల్ ఆక్రమణను ప్రతిఘటించడం సహా లెబనాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించడమే దీని లక్ష్యం. దీన్ని యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్లు తీవ్రవాద సంస్థగా పరిగణిస్తాయి. హెజ్బొల్లా అంటే Party of God అని అర్థం.
కోర్టు కేసు విచారణలో జాప్యం ఓ ఖైదీకి శాపంగా మారిన ఘటన ఇది. సిద్ధిపేట(D) పెద్దగుండవెల్లికి చెందిన పోచయ్య తల్లిని హత్య చేసిన కేసులో 2013లో అరెస్టయ్యారు. సిద్దిపేట కోర్టు యావజ్జీవ శిక్ష విధించగా, దీనిపై ఆయన కుమారుడు హైకోర్టుకెళ్లారు. ఈ జులైలో హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2018లో అనారోగ్యంతో పోచయ్య జైలులోనే మరణించారు. మృతిపై సమాచారం లేక హైకోర్టు కేసును విచారించింది.
పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాలు వెంటాడుతున్నాయి. ఇరాన్, హెజ్బొల్లా రాబోయే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడే అవకాశం ఉందని జీ7 దేశాలను అమెరికా హెచ్చరించింది. సన్నిహిత దేశాలతో సమన్వయం చేసుకొని ఇరాన్, హెజ్బొల్లా దాడులు చేయకుండా ఒత్తిడి తీసుకురావడానికి US సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ జీ7 దేశాలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది.
అమెరికాలో మాంద్యం భయాలు తలెత్తడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికే భారత మార్కెట్ రూ.10 లక్షల కోట్లను కోల్పోయినట్లు అంచనా. జపాన్ 10శాతం, దక్షిణ కొరియా, తైవాన్ చెరో 8శాతం నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్ల మేర నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.80కి పడిపోయింది. పలు ప్రధాన సంస్థల షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 విడుదల మరోసారి వాయిదా పడనుందనే రూమర్స్‌కు మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతం అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ట్వీట్ చేశారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. న్యాయనిపుణులతో పార్టీ సీనియర్లు చర్చిస్తున్నారని, త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతలపై స్పష్టత వస్తుందని, వారిపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొన్నారు.
తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ‘మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్‌గా లభిస్తుంది’ అని వారితో అన్నారు.
ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు దేవర మూవీ నుంచి ‘చుట్టమల్లె’ పాట విడుదల కానుంది. ఎన్టీఆర్‌కు ఇలాంటి పాట వచ్చి చాలాకాలమైందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విటర్‌లో పేర్కొనగా ఓ నెటిజన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఇంత హైప్ ఇస్తున్నారు. అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్’ అని హెచ్చరించాడు. దానిపై శాస్త్రి స్పందించారు. ‘హైప్ కాదు నిజం. సాయంత్రం మళ్లీ చెప్పు, ఇక్కడే ఉంటా’ అని అతడికి కౌంటర్ ఇచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ జరిపిన ఓట్లకు భారీ వ్యత్యాసం ఉందంటూ వస్తున్న ఆరోపణలను EC ఖండించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ సహా పలువిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈసీ స్పష్టంచేసింది. తాత్కాలిక గణాంకాలను, ఓటింగ్ ముగిశాక ప్రకటించిన గణాంకాలతో పోలుస్తున్నారని తప్పుబట్టింది.
Sorry, no posts matched your criteria.