India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ‘మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్‌గా లభిస్తుంది’ అని వారితో అన్నారు.
ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు దేవర మూవీ నుంచి ‘చుట్టమల్లె’ పాట విడుదల కానుంది. ఎన్టీఆర్‌కు ఇలాంటి పాట వచ్చి చాలాకాలమైందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విటర్‌లో పేర్కొనగా ఓ నెటిజన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ‘ఇంత హైప్ ఇస్తున్నారు. అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్’ అని హెచ్చరించాడు. దానిపై శాస్త్రి స్పందించారు. ‘హైప్ కాదు నిజం. సాయంత్రం మళ్లీ చెప్పు, ఇక్కడే ఉంటా’ అని అతడికి కౌంటర్ ఇచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ జరిపిన ఓట్లకు భారీ వ్యత్యాసం ఉందంటూ వస్తున్న ఆరోపణలను EC ఖండించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ సహా పలువిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈసీ స్పష్టంచేసింది. తాత్కాలిక గణాంకాలను, ఓటింగ్ ముగిశాక ప్రకటించిన గణాంకాలతో పోలుస్తున్నారని తప్పుబట్టింది.
సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఎల్లుండి తుది వాదనలు వింటామని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడా నిరాశే ఎదురవడంతో తిరిగి ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.
AP: అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని CM చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. ‘ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసం మొదలుపెట్టింది. పనిచేసే అధికారులను పక్కన పెట్టి బ్లాక్‌మెయిల్ చేసింది. వారి మనోభావాలు దెబ్బతీసింది. అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేసింది. బ్రాండ్ ఏపీ వాల్యూను దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది’ అని మండిపడ్డారు.
TG: షాద్ నగర్‌లో ఎస్సీ <<13778704>>మహిళపై<<>> పోలీసుల దాడిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలనా? ప్రజాపాలనా? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? కుమారుడి ముందే ఆమెను చిత్రహింసలు పెడతారా? ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. మహిళలను గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ దౌర్జన్యాలు మాత్రం చేయొద్దు’ అని తెలిపారు.
పీఎఫ్ ఖాతాలో కీలక మార్పును చేయాలంటే ఎలా అన్నదానిపై EPFO కీలక సూచన చేసింది. తల్లిదండ్రులు, భాగస్వామి పేర్లను మార్చుకునేందుకు పాస్‌పోర్టు, రేషన్ కార్డు, CGHS/ECHS/మెడి క్లెయిమ్ కార్డు, పెన్షన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఫొటో ఐడీ కార్డు, ఆధార్, పాన్, టెన్త్/ఇంటర్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్‌లో కనీసం మూడింటిని సమర్పించాలని తెలిపింది.
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దివంగత శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందట. ఇండియన్ మైథాలజీలో ఉన్న పాత్రల ఆధారంగా సూపర్ హీరో నేపథ్యంలో మూవీ ఉంటుందని టాక్.
ఏపీ ఒకప్పుడు మోడల్ స్టేట్‌గా ఉండేదని, గత ఐదేళ్లలో ఎలా ఉండకూడదనే దానికి నిదర్శనంగా నిలిచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. అందరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. వ్యవస్థలను బతికించాలనే అన్నీ తట్టుకుని నిలబడ్డాం. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలి’ అని పిలుపునిచ్చారు.
అంబానీ ఇంట పెళ్లి వేడుకలో వంటకాలు అద్భుతంగా ఉన్నాయని WWE స్టార్ జాన్ సీనా వెల్లడించారు. ఇండియన్ స్పైసీ ఫుడ్ తినడానికి మరోసారి భారత్ రావాలనుకుంటున్నానని చెప్పారు. వేడుకలో కలిసిన షారుఖ్ మాటలు తనకెంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ‘కింగ్‌ఖాన్‌తో TED(టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్) గురించి మాట్లాడా. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ఆయనతో చేయి కలపడం ఎమోషనల్ మూమెంట్’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.