News October 24, 2025

ఎంపీ vs ఎమ్మెల్యే.. కారణం ఇదేనా?

image

AP: విజయవాడ MP చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ముదురుతోంది. కొలికపూడి గెలుపు కోసం ₹18 కోట్లు ఖర్చు చేశానని, వచ్చే ఎన్నికల్లో TDP నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే <<18082832>>ఇలా మాట్లాడాల్సి<<>> వస్తోందని MLA చెప్తున్నారు. 12 నెలలుగా దేవుడని, ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నారో చెప్పాలని చిన్ని ప్రశ్నిస్తున్నారు.

News October 24, 2025

రాష్ట్రంలో 1,743 పోస్టులు.. అప్లై చేశారా?

image

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే(OCT 28) సమయం ఉంది. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. https://www.tgprb.in/

News October 24, 2025

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవాళ షెడ్యూల్!

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 23 నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

News October 24, 2025

మార్కాపురంలోకి శ్రీశైలం?.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

image

AP: ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల(D) కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల(D) నుంచి తిరిగి ప్రకాశం(D)లో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం.

News October 24, 2025

అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

అయోడిన్‌ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌, రొమ్ముల్లో క్యాన్సర్‌ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News October 24, 2025

బస్సు ప్రమాదం: నువ్ చాలా పెద్ద తప్పు చేశావ్

image

డ్రైవర్‌నే దేవుడిగా భావించి ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కుతారు. కానీ <<18087723>>vKaveri<<>> విషాదంలో మెయిన్ డ్రైవర్ తప్పులు చేశాడనే విమర్శలొస్తున్నాయి. బైక్‌ను ఢీకొట్టగానే బస్ ఆపితే మంటలు చెలరేగేవి కాదు. పైగా ఫైర్ సేఫ్టీతో కాక నీటితో మంటలు ఆర్పే యత్నం చేసి పరిస్థితి చేయి దాటిందని పారిపోయాడు. కనీసం ప్యాసింజర్స్ దిగేలా డోర్ తీయాల్సింది. ప్రమాదంతో హైడ్రాలిక్ కేబుల్స్ తెగి డోర్ తెరుచుకోక చాలామంది బయటకు రాలేక చనిపోయారు.

News October 24, 2025

బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

image

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై PM మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై AP Dy.CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు విజ్ఞప్తి చేశారు.

News October 24, 2025

కంట్రోల్ రూమ్స్ నంబర్లు ఇవే

image

AP: కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు.
☞ కలెక్టరేట్‌లో: 08518-277305
☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి: 9121101059
☞ ఘటనా స్థలి వద్ద: 9121101061
☞ కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం: 9121101075
☞ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:
9494609814, 9052951010
★ బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేయొచ్చు.

News October 24, 2025

ఈ నెల 29న మెగా జాబ్‌మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు(D) నరసరావుపేటలోని ఈశ్వర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, ఫార్మసీ, డిగ్రీ, ఇంజినీరింగ్, MBBS, PG అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 – 35ఏళ్ల మధ్య ఉండాలి. ఈ జాబ్‌మేళాలో 34 MNC కంపెనీలు పాల్గొంటున్నాయి. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

News October 24, 2025

గుడిలో ఈ పనులు చేయకూడదు

image

నిజమైన భక్తికి శాంతమే ఆధారం. అందుకే ఓపిక ఉంటేనే గుడికి రావాలి. అశాంతితో ఇతరుల భక్తి భావానికి ఆటంకం కలిగించకూడదు. అలాంటివారు గుడికి రాకపోవడమే ఉత్తమం. ఆలయానికి వచ్చిన భక్తులు చిత్తంతో ఉండాలి. గట్టిగా మాట్లాడకూడదు. ఫోన్ వాడకూడదు. దైవ దర్శన సమయంలో మీ వంతు వచ్చే వరకు ఓర్పుతో, వినయంగా వేచి చూడాలి. తోసుకుంటూ ముందుకెళ్లడం వంటివి మానుకోవాలి. పూర్తి ఏకాగ్రత దైవం పైనే ఉంచాలి. ఇతర ఆలోచనలు మీ మదిన మెదలకూడదు.