India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒలింపిక్స్‌లో <<13775835>>అదరగొడుతున్న<<>> భారత హాకీ టీమ్‌కు షాక్ తగిలింది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెడ్ కార్డ్ పొందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై FIH ఒక మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో రేపు జరిగే సెమీ ఫైనల్‌కు అతను దూరం కానున్నారు. బ్రిటన్ ప్లేయర్ కల్నన్ తలకు అమిత్ హాకీ స్టిక్ తగలడంతో రిఫరీ రెడ్ కార్డు చూపించిన విషయం తెలిసిందే. దీన్ని హాకీ ఇండియా ఛాలెంజ్ చేయగా, ఇంకా నిర్ణయం వెలువడలేదు.
APకి చెందిన వ్యాపారవేత్త కృష్ణా చివుకుల ఉదారత చాటుకున్నారు. తాను ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన IIT మద్రాస్‌కు ₹228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. రేపు ఒప్పంద కార్యక్రమం జరగనుంది. బాపట్లకు చెందిన చివుకుల 1970లో ఏరోస్పేస్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. న్యూయార్క్‌లో శివ టెక్నాలజీస్ కంపెనీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత బెంగళూరు, రేణిగుంటలోనూ సంస్థలను నెలకొల్పారు. ఈయన గతంలోనూ ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న మురారి సినిమాను 4Kలో రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ సినిమా పలు రికార్డుల్ని సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వాన్స్ సేల్స్‌లో అత్యంత వేగంగా రూ.50 లక్షల కలెక్షన్లు సాధించడంతో పాటు బుక్‌మైషోలో 24 గంటల్లో 40.01 వేల టికెట్ల బుకింగ్స్‌తో ‘బిజినెస్‌మ్యాన్’ రికార్డును తిరగరాసింది. సుదర్శన్ 35MMలో రిలీజ్ రోజుకు ఒక్క టికెట్టూ మిగలలేదు.
మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా వక్ఫ్ బోర్డ్ స్వయంప్రతిపత్తిని లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ప్రతిపాదనలు పార్లమెంటు ముందుకు రాకుండానే మీడియాలో రావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సవరణలు అమోదం పొందితే ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపే వక్ఫ్ ట్రిబ్యునల్ అన్ని హక్కులు కోల్పోతుందని ఆయన వివరించారు.
ఈజిప్టులో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935లో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. ఆ మహిళ 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. కాగా పలు పరిశోధనలు చేసినా ఆమె నోరు తెరిచి ఉండటానికి ఓ నిర్దిష్టమైన కారణాన్ని చెప్పలేకపోయారు. హింసాత్మక మరణం, నొప్పితో అరుస్తూ చనిపోవడం, మృతదేహాన్ని భద్రపరిచే విధానంలో లోపం, కుళ్లిపోయే ప్రక్రియ, మృతదేహాలను బలంగా చుట్టేయడం వంటివి కారణాలు కావొచ్చని ఇటీవల వెల్లడించారు.
TG: ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనుంది. రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లను వేర్వేరుగా 16 ఏళ్లు, 18 ఏళ్లు, 22 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసింది. రేపు వీటి వేలం అనంతరం ఆ మొత్తం ఖజానాకు చేరనుంది. కాగా ఈ ఏడాది జులై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.
శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా DECలో రిలీజ్ అవుతుందని నిర్మాత ప్రకటించినా తాజాగా ఓ న్యూస్ వైరలవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’, మార్చి 28న ‘VD12’ డేట్స్ లాక్ చేసుకోగా ‘గేమ్ ఛేంజర్’ అదే టైమ్‌కి వస్తే పోటీ ఆసక్తికరంగా మారనుంది.
AP: స్పెషల్ ఆఫర్‌లో ₹12వేలకే యాపిల్ ఫోన్ అనే యాడ్ చూసి బుక్ చేసిన వ్యక్తి ఇంటికి యాపిల్ పండ్లు డెలివరీ అవడంతో కంగుతిన్నాడు. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ యువకుడికి FBలో ఈ ఆఫర్ కనిపించింది. క్యాష్ ఆన్ డెలివరీ ఉండటంతో బుక్ చేశాడు. ఇంటికి కొరియర్ రాగానే ₹12వేలు చెల్లించి తీసుకున్నాడు. ఓపెన్ చేస్తే యాపిల్స్ కనిపించాయి. యాప్‌లో రిటర్న్ ఆప్షన్ లేకపోవడం, యాడ్‌లో ఉన్న నంబర్ పనిచేయకపోవడంతో మిన్నకుండిపోయాడు.
ఉపాధి కోసం రష్యా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన భారతీయులు నరకయాతన అనుభవిస్తున్నారు. అక్రమ చొరబాటుదార్లను రష్యా ప్రభుత్వం బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపుతోంది. ఇలా ఇప్పటిదాకా 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 12 మంది రష్యా సైన్యం నుంచి ఇప్పటికే విడుదలవ్వగా, మరో 63 మంది తమను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.
TG: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణంలో వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఇవాళ ప్రధానంగా సిరిసిల్ల, ADB, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, MDK, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. దీంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.